తీసింది మూడు సినిమాలే అయినా.. తనకంటూ ఒక స్పెషల్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికీ.. ఈ మూడు సినిమాలు దేనికవే ప్రత్యేకం. ఈ మూడు సినిమాల్లో స్టొరీ ఐడియా, నెరేషన్ కొత్త పంధాలో వుంటుంది. అయితే ఈ మూడు కథలకి ఓ కామన్ పాయింట్ వుంది. ఈ మూడు సినిమాల్లో కథ హీరోయిన్ పాత్రే చుట్టూనే వుంటుంది. హీరోయిన్ పాత్ర ద్వారానే డ్రామా క్రియేట్ అవుతుంది.
వివేక్ ఇప్పుడు నానితో చేసిన ‘సరిపోదా శనివారం’లో కూడా హీరోయిన్ పాత్రే ఒక స్పెషల్ ఎలిమెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ నానికి జోడిగా కనిపిస్తోంది. పోలీస్ కానిస్టేబుల్ చారులత పాత్రలో తను నటించింది. ఈ కథలో ఆమె పాత్రకు ఒక బ్యాక్ స్టోరీ వుంటుందట, మొత్తం కథని మలుపు తిప్పే పాత్ర చారులతేనని తెలుస్తోంది. యూనిట్ కూడా ఆమె క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయడం లేదు. ట్రైలర్ లో కూడా ఒక్క డైలాగ్ కే పరిమితం చేశారు. ఆమె క్యారెక్టర్ బ్యాక్ స్టొరీ వర్క్ అవుట్ అయితే ఇక సినిమాకి తిరుగుండదని చిత్ర యూనిట్ నమ్మకంగా వుంది. ఆగస్ట్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్ల కార్యక్రమంలో బిజీగా ఉంది.