హైడ్రా అలజడి బీఆర్ఎస్ను గట్టిగానే తాకుతోంది. చెరువుల్ని ఆక్రమించుకున్న అక్రమ కట్టడాలను పెద్ద ఎత్తున కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ కూడా తర్వాత జాబితాలో ఉందన్న ప్రచారం ఊపందుకుది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు., హైడ్రా అధికారులపై ఒత్తిడి పెంచేందుకు హిమాయత్ సాగర్ బఫర్ జోన్లలో ఎవరెవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయ గూగుల్ మ్యాప్లు బయటకు తీసి.. వాటి సంగతేమిటని ప్రశ్నించడం ప్రారంభించడం ప్రారంభించారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిషాంక్ అదే పనిగా కాంగ్రెస్ లీడర్ల ఫామ్ హౌస్ ల గూగుల్ మ్యాప్ లు బయటకు తీసి.. వాటిని ఎప్పుడు కూలుస్తారని ప్రశ్నించడం ప్రారంంభించారు. ఈ జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలవే కాదు.. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్.. అలాగే కాంగ్రెస్ బడా లీడర్.. తెర వెనుక వ్యూహకర్త కేవీపీ ఫామ్ హౌస్ ల సంగతి ఏం చేస్తారని చేస్తారని ఆయన ప్రశ్నిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్లు కూల్చేస్తారన్న ప్రచారంతో.. ముందుగా.. కాంగ్రెస్ నేతలకు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ లు ఉన్నాయని వాటిని కూడా కూల్చాలన్న డిమాండ్ తో ఈ పోస్టింగులు పెట్టారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే హైడ్రా అధికారులు ఇప్పటికి ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. చెరువును కబ్జా చేసినట్లుగా తేలితే కూల్చేస్తున్నారు. మరి క్రిషాంక్ భిన్నమైన బ్లాక్ మెయిలింగ్ వర్కవుట్ అవుతుందో లేదో మరి !