అడ్డదిడ్డమైన జోస్యాలతో అడ్డగోలుగా మాట్లాడుతూ ఇతరులను నాశనం చేసి తాను సంపాదించుకుంటున్న వేణు స్వామికి జర్నలిస్ట్ మూర్తి దెబ్బ గట్టిగానే పడినట్లుగా కనిపిస్తోంది. ఆయన మూర్తి ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని భార్యతో సహా కలిసి వీడియో పెట్టేశారు. సినిమాల్లో తిరిగిన అనుభవం కాబట్టి కాస్తంత ఆత్మహత్య అనే బెదిరింపుల సిట్యూయేషన్ కూడా కలిపారు. మూర్తి ఐదు కోట్లు అడుగుతున్నారని ఆ దంపతులు చెప్పుకొచ్చారు.
మూర్తి ఐదు కోట్లు కాదు కదా.. ఐదు రూపాయలు కూడా తీసుకునే వ్యక్తి కాదని మీడియా అందరికీ తెలుసు. ఆయనది బెదిరింపుల.. బ్లాక్ మెయిల్ జర్నలిజం కాదని ఇండస్ట్రీ అంతటికి తెలుసు. తన గుట్టు రట్టు చేసినందుకే వేణు స్వామితో పాటు ఆయన భార్య లబలబలాడిపోతున్నారు. ఇప్పుడు ఐదు కోట్లంటున్నారు.. రేపు ఆయన భార్యతో కలిసి మరో రకమైన ఆరోపణలు చేయించినా చేయిస్తారు. ఎందుకంటే.. అసలు మూర్తి బ్లాక్ మెయిలింగ్ చేయలేదు… ఇప్పుడు వేణుస్వామినే ఆత్మహత్య పేరుతో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు.
జోస్యాల పేరుతో వేరేవారి జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసిన.. ఆడుకున్న వేణు స్వామి జాతకం ఇప్పుడు తిరగబడింది. ఇంత కాలం ఎవరూ పట్టించుకోకపోవడంతో తనదే రాజ్యం అన్నట్లుగా మోసపోయిన వాళ్లందర్నీ మోసం చేశారు. ఇప్పుడు ఆయన తప్పుడు ప నులు చేస్తున్నట్లుగా మూర్తి ప్రజల ముందు పెట్టడంతో తమదైన ట్రూ కలర్స్‌తో బయటకు వచ్చారు.