దువ్వాడ, మాధురీలపై పోలీసులు చర్యలెందుకు తీసుకోరు ?

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాల చూసేందుకు ప్రజలకు మరింత కాలం అవకాశం ఇవ్వాలని పోలీసులు అనుకుంటున్నారేమో కానీ.. ఈ డ్రామాను నిరంతరం కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దివ్వెల మాధురీ కూడా అరెస్టు చేయగలిగిన నేరాలు చేశారని వీడియో సాక్ష్యాలతో సహా ఉన్నాయి. కానీ వారిపై పోలీసులు కేసులు పెట్టడడం లేదు.. చర్యలు తీసుకోవడం లేదు.. దీంతో ఆయన పోలీసులకు చేత కాదని చెప్పి.. వారిపైనే రివర్స్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు.

దివ్వెల మాధురీ ఉద్దేశపూర్వకంగా వేరే కారును ఢీకొట్టారు. ఇది అత్యంత తీవ్రమైన నేరం. ఆ కారులో ఉన్న ముగ్గురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. మామూలుగా అయితే ఆమెను అప్పుడే అరెస్టు చేసి జైలుకు పంపాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ ఆ కోణంలో పోలీసులు కేసులు కూడా పెట్టలేదు. ఇక అరెస్ట్ కు చాన్స్ లేదు. ఇక దువ్వాడ శ్రీనివాస్ భార్య బిడ్డలను కొట్టేందుకు వెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై రుబాబు చేశారు. ఆయనపైనా కేసులు పెట్టలేదు.

Read Also : దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్

ఇప్పుడు ఆయనే రివర్స్‌లో తన భార్య, బిడ్డపై పోలీసులు చర్యలు తీసుకోలేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలు దువ్వాడ ఇష్యూ ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటే .. న్యూసెన్స్ చేస్తున్నారనుంటే పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. కానీ అలాంటిది చేయకుండా.. వారు దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురీ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో చూసేవారికీ అర్థం కావడంలేదు.

దువ్వాడ ఫ్యామిలీలో ఏం జరిగినా అది వారి వ్యక్తిగతం. ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే. ఈ విషయం పోలీసులకు ఎందుకు గుర్తు రావడం లేదో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్‌రాజుకు కీల‌క పద‌వి?

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎఫ్‌.డి.సి (ఫిల్మ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌) ఛైర్మ‌న్‌గా దిల్ రాజును ఎంపిక చేయొచ్చ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌....

కొత్త ట్రెండ్ : ఇంటికన్నా ఇంటీరియర్ ఖర్చు ఎక్కువ !

ఓ దశాబ్దం కిందట ఇల్లు అంటే... గోడలు, అల్మరాలు మాత్రమే. ఇంకా కాస్త డబ్బు ఉంటే.. ఆ అల్మరాలకు ప్లైఉడ్ తలుపులు పెట్టించుకుంటారు. కానీ తర్వాత రాను రాను...

విడదల రజనీ వసూళ్లపై విచారణ

విడదల రజనీ వసూళ్లపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది . అధికారంలో ఉన్నప్పుడు చిలుకలూరిపేట మొత్తాన్ని దున్ని పారేసినట్లుగా వసూళ్లు చేశారు రజనీ గ్యాంగ్. ఆమె బావమరిది ఈ గ్యాంగ్...

జానీ పంచాయితీ… ఆ హీరో ద‌గ్గ‌ర‌కు?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం టాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేస్తోంది. ఏ ఇద్ద‌రు మాట్లాడుకొన్నా టాపిక్ ఇదే. జానీ మాస్ట‌ర్ త‌ప్పు చేశాడా? లేదా? ఆ అమ్మాయి వెనుక ఎవ‌రున్నారు? ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close