యువరాజ్ సింగ్… ఒక జనరేషన్ ఇండియన్ క్రికెట్ కి హీరో. దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవంతగా సాగిన యువీ కెరీర్ లో ఎన్నో మైలు రాళ్ళు వున్నాయి. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో తనది హీరో రోల్. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన వీరుడు. ఇప్పుడీ క్రికెట్ హీరో కథ వెండితెరపైకి రానుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్ యువీ బయోపిక్‌ను రూపొందించనుంది. నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు.
Also Read : బాలయ్య అన్ స్టాపబుల్ షోకు సీఎం రేవంత్ రెడ్డి?!
ఇందులో హీరోగా ఎవరు కనిపిస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ పాత్ర కోసం ప్రముఖ కథానాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. యువీ క్రికెట్ సూపర్ స్టార్. ఇది కచ్చితంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది. ఒక మంచి సినిమాకి కావాల్సిన అన్ని ఎత్తుపల్లాలు యువీ జీవితంలో వున్నాయి. క్యాన్సర్‌తో పోరాడి ఆయన ఎంతోమందిలో మనోధైర్యాన్ని నింపారు. క్యాన్సర్ అని తెలిసినా ఒక దశలో రక్తం కక్కుతూ కూడా మైదానంలో ప్రత్యర్దులపై విరుచుకుపడి, జట్టుకి విజయాల్ని అందించిన సెన్సేషనల్ ప్లేయర్ యువీ. ఈ బయోపిక్ యువీ అభిమానులకే కాదు యావత్ క్రీడా, సినీ ప్రేక్షకులు మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ అని చెప్పడంలో సందేహం లేదు. ‘ధోని’ తరవాత క్రికెట్ నేపథ్యంలో సరైన సినిమా ఏదీ బాక్సాఫీసు ముందుకు రాలేదు. గంగూలీ బయోపిక్ అన్నారు కానీ, అది ఎంత వరకూ వచ్చిందో తెలీదు. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో ఓ సినిమా వచ్చింది. కానీ బాక్సాఫీసు దగ్గర ఆదరణ దక్కలేదు. ఇప్పుడు యువీ అయినా క్రికెట్ కథలకు వెన్నె తీసుకొస్తాడేమో చూడాలి.