రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచ బ్యాంకుతో పాటు ఏబీడీ ప్రతినిధులు కూడా సీఎంను కలిశారు.
అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15వేల కోట్ల రుణసదుపాయానికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో… ఈ భేటీ జరిగింది. 15వేల కోట్ల చెల్లింపులకు ఏపీ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ రెండు సంస్థల ప్రతినిధులు ఈ నెల 27వ తేదీ వరకు అమరావతిలో పర్యటించబోతున్నారు. సీఎంతో జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
రాజధానిలో మౌళిక సదుపాయాల కల్పన, భవనాల నిర్మాణంతో పాటు అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులపై చర్చించారు.