ఇక్కడ అంత సర్దేసుకున్న జగన్ లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన విజయవాడలో పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకున్నారు. బోలెడన్ని కేసులు ఉన్నా.. ఆయన పాస్ పోర్టు రెన్యూవల్ అయింది. అందుకే ఇప్పుడు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెలలో తాను బ్రిటన్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నానని పర్మిషన్ ఇవ్వాలని ఆ పిటిషన్ సారాంశం. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.
విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటనకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ పై తీర్పు 30వ తేదీన రానుంది. చాలా కాలంగా విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే.. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ ఒకే సారి పిటిషన్లు వేస్తూంటారు. ఇద్దరూ అనుమతులు తీసుకుంటారు. కానీ జగన్ మాత్రం నేరుగా వెళ్తారు. విజయసాయిరెడ్డి ఎలా వెళ్తారో.. ఎక్కిడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. ఈ సారి కూడా జగన్ లండన్ పర్యటన కోసం పిటిషన్ వేసుకునే సమయంలోనే విజయసాయిరెడ్డి కూడా అదే పని చేశారు.
వీరిద్దరూ విదేశాల్లో కలుస్తారో లేదో కానీ.. జగన్ రెడ్డి తరపున సూట్ కేసు కంపెనీలను ఏర్పాటు చేసింది.. వాటిని నిర్వహించింది.. విజయసాయిరెడ్డే. ఇప్పుడు కూడా ఆయనకు అవే బాధ్యతలు ఉండి ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి న్యాయస్థానాలు విదేశీ పర్యటనకు అనుమతించి ఉంటాయని ఈ సారి సీబీఐ గట్టిగా వ్యతిరేకిస్తే.. .. కోర్టు అనుమతించకపోవచ్చని భావిస్తున్నారు.