ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనల నుంచి పుట్టిన కార్యక్రమం జన్మభూమి. మొదటి సీఎం అయినప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదో ట్రెండ సెట్టర్. గ్రామాల్లోనే జన్మభూమి సభలు నిర్వహించి అక్కడిక్కడ సమస్యలను పరిష్కరించడమే కాదు పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పరిష్కారానికి వినతులు తీసుకుంటారు. ఊరుకు.. గ్రామానికి.,. నియోజకవర్గానికి ఏం చేయాలో అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసేవారు.
ప్రజాసమస్యల పరిష్కాంలో జన్మభూమి ట్రెండ్ సెటర్
జన్మభూమి కార్యక్రమాన్ని అదే పేరుతో కొనసాగించడం ఇష్టం లేని తర్వాత పాలకులు.. రచ్చబండ అని.. మరొకటి అని పేరు పెట్టి కొనసాగించారు. అయితే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఏదీ సక్సెస్ కాలేదు. గత ప్రభుత్వం అసలు ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం తెలివి తక్కువ పనిగా భావించి సైలెంట్ గా ఉండిపోయింది. అసలు ప్రజల దగ్గరకే పోలేదు. అసలు ప్రభుత్వం ఉందో లేదో వారికి తెలియని పరిస్థితి. వాలంటీర్లు… సచివాలయ ఉద్యోగులతో చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. వారి వల్ల ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురయ్యారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలకు.. ప్రభుత్వానికి తెగిన లింక్
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య లింక్ గత ప్రభుత్వం వల్ల తెగిపోయిందని చంద్రబాబుకు క్లారిటీ రావడంతోనే మళ్లీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అధికారం చేపట్టగానే జన్మభూమి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు మరింత టెక్నాలజీ పెరిగిపోయింది. స్పాట్లో సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. అందుకే మరింత డైనమిక్ గా… జన్మభూమి 2.0కి రూపకల్పన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రజలను పాలనలో భాగం చేయడం సక్సెస్ సీక్రెట్
చంద్రబాబు పాలన చేపట్టిన మొదట్లో.. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. జన్మభూమిలో ప్రజల్ని అన్ని స్థాయిల్లో భాగస్వామ్యం చేసుకునే ప్రయత్నం చేశారు. చివరికి తమ కాలనీల్లో అభివృద్ధి పనులకు కూడా ప్రజలు విరాళాలిచ్చేవారు. ఓ రోడ్డు కావాలంటే ముఫ్పై శాతం ప్రజలు చందాలేసుకునేవారు… మిగతా 70 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేది. అలాగే శ్రమదానం వంటివి కూడా. ఇవన్నీ రాష్ట్రంలో… పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినట్లు చేశాయి. మరోసారి అలాంటి ప్రజా భాగస్వామ్య పాలన తీసుకు రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.