శ్రీసిటీలో చంద్రబాబు పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొంత మంది ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల ప్రస్తావన తీసుకు వచ్చారు. తాము ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టాం కానీ ప్రభుత్వం హమీ నెరవేర్చుకోలేదన్నది వారి భావన. తాజాగా హెచ్సీఎల్ ప్రతినిధులు లోకేష్ ను కలిసినప్పుడు కూడా.. ఒప్పందం ప్రకారం తమకు రావాల్సిన ప్రారిశ్రామిక ప్రోత్సాహకాలు అందలేదని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లోకేష్ కూడా ఆశ్చర్యపోయారు.
పారిశ్రామిక ప్రోత్సహకాలు అనేది ప్రతి రాష్ట్ర విధానంలో ఓ భాగం. పెట్టుబడులు వస్తే నిరంతర అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అందుకే కొంత రాయితీలు ఇచ్చి అయినా పరిశ్రమల్ని ఆకర్షిస్తూంటారు. గత ప్రభుత్వం.. షిరిడి సాయికి.. మేఘాకు.. రాఘవ కన్ స్ట్రక్షన్స్కు ఇచ్చిన రాయితీలు… కియా, హెచ్సీఎల్ తో పాటు ఇతర బడా కంపెనీలకు ఇవ్వలే్దు. ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు. ఫలితంగా పారిశ్రామిక వృద్ధి పూర్తిగా మందగించింది.
ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అందరూ తమకు రావాల్సిన పారిశ్రామిక రాయితీల గురించి .. వాకబు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వారు పడిన వేదన చూసి .. ప్రభుత్వం కూడా వేగంగా స్పందిస్తోంది. పారిశ్రామిక రాయితీలే కాదు.. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మరింత అనుకూలమైన పాలసీని తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. ఓ రాష్ట్ర పారిశ్రామిక వాతారవణాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ఏ ప్రభుత్వం కూడా సిద్ధం కాదు. కానీ జగన్ మాత్రం వేరు. తన స్వలాభం కోసం.. మొత్తం ఏపీ పారిశ్రామిక వాతావరణాన్ని నాశనం చేశారు.
తనకు తెలిసిన కొంత మంది … ఆ గాలి మరల విద్యుత్ లో పెట్టుబడులు పెట్టడమే పారిశ్రామికాభివృద్ధి అన్నట్లుగా వ్యవహరించారు. ఏ రాయితీలు ఇచ్చినా వారికే ఇచ్చారు. తనకు మేలు చేసుకున్నారు కానీ రాష్ట్రాన్ని నాశనం చేశారు.