నితిన్ – విక్రమ్ కె.కుమార్ లమధ్య మంచి రిలేషన్ ఉంది. విక్రమ్‌తో ఇష్క్ సినిమాని నితినే స్వయంగా నిర్మించాడు. ఆ సినిమా నితిన్ కెరీర్‌కి బాగా హెల్పయ్యింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్‌కి ఆ సినిమా ఓ బూస్టప్. ఆ కారణంతోనే మనం సినిమా ప్రాజెక్టు సెట్ చేయడంలో నితిన్ కీలక భూమిక పోషించాడు. అప్పటి నుంచి విక్రమ్‌కీ.. నితిన్‌కి రాపో మరింత పెరిగింది. ఆ అనుబంధంతోనే సూర్య నటించిన 24 సినిమా రైట్స్‌ని తెలుగులో చేజిక్కించుకోవాలని ప్లాన్ చేశాడు నితిన్. దానికి విక్రమ్కూడా ఓకే అన్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా విడుదల కానున్నదని.. అప్పట్లో ప్రకటించారు కూడా.
అయితే.. ఇప్పుడు నితిన్ చేతుల్లోంచి ఈ సినిమా జారిపోయింది. శ్రేయాస్ మీడియా తెలుగు హక్కుల్ని కొనుగోలు చేసింది. సూర్య ఈ సినిమాకి నిర్మాత. డబ్బింగ్ రైట్స్ వ్యవహారం కూడా సూర్యనే దగ్గరుండి చూసుకొంటున్నాడు. శ్రేష్ట్ మీడియాకే డబ్ రైట్స్ ఇస్తే…. అనుకొన్నంత గిట్టుబాటు అవ్వడం లేదని సూర్య భావించాడట. అందుకే… అర్జెంటుగా ఈ సినిమాకి మరొకరికి కట్టబెట్టాడు. దాంతో 24 సినిమాపై ఆశలు పెట్టుకొన్న నితిన్… ఒక్కసారిగా నీరుగారిపోయాడు. ఫ్రెండ్ షిప్ ఫ్రెండ్ షిప్పే… డబ్బు డబ్బే…అనేది ఈ వ్యవహారంతో మరోసారి నిరూపణ అయ్యింది. కోట్లతో ముడిపడిన వ్యవహారంలో విక్రమ్ మాత్రం ఏం చేస్తాడు???