చైతన్య : ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కీచకులా – ఇతర చోట్ల అంతా నీతి మంతులా ?

కేరళలో ఏడెళ్ల కిందట జరిగిన ఓ ఘటన నేపధ్యంగా అక్కడి పరిశ్రమ హేమ కమిటీని నియమించింది. ఏడేళ్ల తర్వాత ఆ కమిటీ నివేదిక సమర్పించింది. అందులో ఇండస్ట్రీ అంతా కీచకులే ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ప్రతీ దశలోనూ మహిళల్ని వేధిస్తున్నారని నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా అన్ని చోట్లా ఇండస్ట్రీని నిందించడం ప్రారంభించారు. కానీ చాలా మందికి వస్తున్న.. ఇతర చోట్ల అంతా నీతి మంతులు ఉంటారా అని .

అన్ని చోట్లా ఒకే మనుషులు.. అవే మనస్థత్వాలు !

బ్యాంకింగ్ రంగంలో పని చేసే వారిపై లైంగిక వేధింపులు ఉండవా… విద్యాసంస్థల్లో పని చేస్తున్నంత మాత్రాన అంతా నీతి మంతులే ఉంటారా… సాఫ్ట్ వేర్.. హార్డ్ వేర్..ఇలా ప్రతీ రంగంలోనూ మహిళలు ఉన్నారు. వారందరూ.. సేప్ జోన్లలో పని చేస్తున్నారా ?. ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వేధింపులు ఉంటున్నాయా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఒక్కరి వద్ద సమధానం ఉండదు. మనుషులు.. వికృత మనస్థత్వం ఉన్నవారు.. అన్ని చోట్లా ఉంటారు. వారు చేసే పనులకు బలైపోయేవారు ఉంటారు. అంటే… ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం కాదు. కానీ చిత్రంగా ఇండస్ట్రీలోనే అలాంటివి ఉంటాయన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

హేమ కమిటీల్ని ఇతర రంగాల్లో వేస్తే ఇంకా భయంకర నిజాలు వెలుగులోకి !

ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల్ని ఇలా చేస్తారంట.. అలా చేస్తారంట అని గాసిప్స్ చెప్పుకుని సంతోషపడేవారికి కొదవ ఉండదు. ఈ క్రమంలో అక్కడ ఏం జరిగినా మీడియా భూతద్దంలో చూపిస్తుంది. అది ఫిల్మ్ ఇండస్ట్రీపై చులకన భావం ఏర్పడేలా చేస్తోంది. కానీ కేరళ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ విషయంలో వేసిన హేమ కమిటీ తరహా కమిటీలో ఇతర రంగాల్లో ఉన్న మహిళల పరిస్థితుల్ని అధ్యయనం చేస్తే ఇంకా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కానీ ప్రభుత్వాలు వాటిని డీ గ్లామర్ గా భావిస్తాయి. వాటిలో ఏం జరిగినా లోపల్లోపల జరిగిపోతే చాలనుకుంటాయి. కానీ సినీ పరిశ్రమ విషయంలో మాత్రం రచ్చ చేస్తూంటయి.

మారాల్సింది మనస్థత్వాలు !

వికృత ఆలోచనలు ఉన్న మగాడు ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఒకే రకంగా ప్రవర్తిస్తాడు. అవకాశాల కోసం హద్దులు దాటాలనుకునే మహిళలు కూడా ఉంటారు. ఇలా రెండు వైపుల నుంచి ఉండే తప్పుల వల్లే… అనేక సమస్యలు పుట్టుకు వస్తున్నాయన్నది అసలు నిజం. దీన్ని గుర్తించి అన్ని రంగాల్లోనూ వేధింపుల అవకాశం లేని పని వాతావరణం కల్పించేలా కృషి చేయాలి కానీ.. ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ మీద నిందలు వేస్తే ప్రయోజనం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

Q&A ల‌కు భ‌య‌పడుతున్న పెద్ద హీరోలు

Q&A... ఈమ‌ధ్య సినిమా ప్ర‌మోష‌న్ అంటే గుర్తొచ్చేది ఇదే. చిత్ర‌బృందం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి, వాళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌డం. ఒక్కో ఈవెంట్ కి ప‌దుల కొద్దీ యూ ట్యూబ్...

అదానీ గుట్టు స్విట్టర్లాండ్‌లో రట్టు ?

అదానీ గ్రూప్ ఎలాంటి ప నులు చేసిన ఇండియాలో విచారణల్లో పెద్దగా ఏమీ తేలదు కానీ.. స్విట్జర్లాండ్ లో మాత్రం అలా కాదు. ఇప్పుడు ఆ గ్రూప్ కు చెందిన...

అది జానీ రిమాండ్ రిపోర్టు – అంగీకార పత్రం కాదు !

కొరియో గ్రాఫర్ జానీ తాను తన అసిస్టెంట్ ను మైనర్ గా ఉన్నప్పటి నుంచి రేప్ చేశారని అంగీకరించారని కొన్ని మీడియా సంస్థలు విస్తృతంగా ప్రచారం చేశాయి. ఈ ప్రచారాన్ని...

పవన్ కల్యాణ్ “సనాతన ధర్మ” రాజకీయం !

తిరుమల లడ్డూ విషయంలో ఏర్పడిన వివాదంపై పవన్ కల్యాణ్ స్పందించిన వైనం హిందూ సమాజంలో చర్చకు దారి తీసింది. ఆయన రాజకీయ నాయుకుడు కాబట్టి కచ్చితంగా ఆ స్పందనలో రాజకీయ కోణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close