కులం కాన్సెప్ట్ తో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత..దేశ ప్రతిపక్ష నేత చేస్తున్న రాజకీయం కాస్త లైన్ క్రాస్ అయిపోతోంది. ఆయన అన్ని రంగాల్లో కులాల వారీగా ప్రాధాన్యత దక్కాలని అనుకుంటున్నారు. చివరికి మిస్ ఇండియా పోటీల్లో కూడా . మిస్ ఇండియా పోటీల్లో ST, SC, మైనారిటీ వాళ్ళు ఎందుకు ఉండట్లేదని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశ్నించేశారు.
అంతే కాదు.. తాను మిస్ ఇండియా లిస్ట్ తీసాను అందులో ఒక్క దళిత్, ఆదివాసి, ఓబీసీకి సంబంధించిన మహిళా ఉండరు.. బాలీవుడ్లో సైతం 90 శాతం వీళ్ళు ఎవ్వరు ఉండరని తేల్చారు. రాహుల్ గాంధీ మాటలు విని ఎదురుగా ఉన్న వాళ్లు కూడా అవాక్కయ్యారు. మిస్ ఇండియా పోటీలు దేశ జనాభాలో 99.9 శాతానికి సంబంధం లేనివి. అదో లోకం., అక్కడ కూడా ఈ కుల ప్రస్తావన ఎందుకో ఎదురుగా కూర్చున్న వారికి అర్థం కావడం లేదు.
ఇక బాలీవుడ్ అవకాశాల గురించీ ఆయన మాట్లాడుతున్నారు. బాలీవుడ్ అగ్ర హీరోలంతా ముస్లిం వర్గాలకు చెందినవే. కానీ ఎప్పుడూ ఎవరూ అలా అనుకోలేదు. కానీ రాహుల్ గాంధీ మాత్రం.. హీరోయిన్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఎదుకు లేరని అంటున్నారు. నిజానికి కులాల్ని చూసి అవకాశాలిచ్చేంత స్థాయికి బాలీవుడ్ మాత్రమే కాదు.. ఏ సినీ పరిశ్రమ కూడా ఎదగడమో.. దిజారడమో చేయలేదు. రాహుల్ మాత్రం రిజర్వేషన్ల కేటగిరిలోకి సినీ పరిశ్రమ, అందాల పోటీల్ని కూడా తీసుకు రావాలన్నట్లుగా మాట్లాడుతున్నారు.