వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లూ పార్టీగా పేరును సార్థకం చేసుకుంటోంది. చిన్నా చితకా నేతలు కాదు.. బడా నేతలే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా చేసిన వ్యవహారాలు ప్రజల ముందుకు వస్తున్నాయి. కానీ ఆయా ఘనతలకు పాల్పడిన ఒక్కరంటే ఒక్కరూ సిగ్గుపడటం లేదు. నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి తమ వీడియోలు కాదని మార్ఫింగ్‌లు చేశారని చెప్పుకుంటున్నారు. ఈ నేతల బరితెగింపు ప్రజల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ అనే నేత చేసిన జుగుప్సాకరమైన వ్యవహారం సంచలనం సృష్టించింది. చూస్తే అది నిజమని ఎవరికైనా అర్థమవుతుంది అయినా ఫేక్ అని చెప్పేందుకు ఏకంగా సీఐడీనే రంగంలోకి దించారు. ఇప్పుడు పోలీసులు గోరంట్ల మాధవ్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ జరిపితే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఒక్క గోరంట్ల మాధవ్ కాదు.. గంట.. అరగంట పేరతో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌లు ఎంత పాపులర్ అయ్యారో చెప్పాల్సిన పని లేదు. వీరంతా అధికారంలో ఉన్నప్పుడే ఈ ఘనకార్యాలకు పాల్పడ్డారు.
ఇక అధికారం పోయిన తరవాత విజయసాయిరెడ్డి .. స్పైనల్ కార్డు వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇప్పుడు అనంతబాబు నిర్వాకం వెలుగులోకి వచ్చింది. పైగా తనను బెదిరిస్తుననారని కూడా చెప్పుకుంటున్నారు. ఎంత మందితో ఇలాంటి నిర్వాకాలు చేశారో కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారాన్ని అండగా పెట్టుకుని ఏదో సాయం చేస్తామని బెదిరించి.. భయపెట్టి ప్రలోభపెట్టి మహిళల్ని లోబర్చుకుని ఇలాంటి ఘోరాలకు పాల్పడ్డారు. ఇప్పుడేమో మార్ఫింగ్లని కథలు చెబుతున్నారు.
వైసీపీ నేతల వ్యవహారం.. వారు చేసిన కీచకాలపై మహిళలు ముందుకు వచ్చి కేసులు పెడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ దిశగా పోలీసులు కూడా వారికి భరోసా ఇస్తే… ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫిర్యాదు చేసేవారి ఐడెంటీటీ బయట పెట్టకుండా.. చర్యలకు హమీ ఇస్తే చాలా మంది బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.