జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రద్దు చేసేసిన ఇండియాలో సంపూర్ణంగా కలిపేసుకున్న తర్వాత తొలి సారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. 2018లో అసెంబ్లీ రద్దయిన తర్వాత ఇప్పటి వరకూ అక్కడ రాష్ట్రపతి పాలనే ఉంది. కాశ్మీర్ ఎన్నికల నిర్వహణ సవాలే. అయినా ఈసీ లోక్ సభ ఎన్నికలు నిర్వహించింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయింది.
ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతోంది. కాంగ్రెస్ , నేషల్ కాన్ఫరెన్స్ 2008లో కలసి పోటీ చేసి విజయం సాధించాయి. తర్వాత విడిపోయాయి. మరో ప్రధాన పార్టీ పీడీపీగా ఉంది. గతంతో బీజేపీ పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహబూబా ముఫ్తీకి సీఎం పదవి ఇచ్చింది.
హిందూ వర్గాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేసింది. లోక్‌సభ ఎన్నికలలో జమ్మూలోని ఉధంపూర్, జమ్మూ లోక్ సభ సీట్లను గెల్చుకుంది. శ్రీనగర్, అనంత నాగ్, రాజౌరి లోక్ సభ స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాశ్మీర్ లోయలోని బారాముల్లా నుంచి జైల్లో ఉన్న వేర్పాటు వాద నేత ఎంపీగా గెలవడం సంచలనంగా మారింది. లోక్‌సభ ఎన్నికలలో వచ్చిన ఓట్ల ప్రకారం చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ 36 చోట్ల, బిజెపి 29 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత చూపిస్తోంది. పీడీపీ ఐదు, కాంగ్రెస్ ఏడు చోట్ల ఆధిక్యత చూపించాయి.
వేర్పాటు వాద శక్తులకు బలం పెరగకూడదంటే.. బీజేపీని గెలిపించాలన్న నినాదాన్ని అంతర్గతంగా తీసుకెళ్తున్నారు. కశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే మళ్లీ వివాదాలు ఏర్పడకుండాఉంటాయని.. బయట అభిప్రాయం ఉంది. మరి కశ్మీర్ ప్రజలు ఏనుకుంటున్నారో త్వరలో తేలనుంది.