హైదరాబాద్‌లో ఇప్పుడు లగ్జరీగా జీవించాలనుకునేవారి దృష్టి ఎక్కువగా మోకిల వైపు పడుతోంది. శంకర్పల్లి మండలం మోకిల ప్రాంతంలో ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇతర చోట్ల కన్నా ఈ ప్రాంతంపైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. గత ప్రభుత్వం భూములు వేలం వేసినప్పడు ఇక్కడ గజం లక్ష పలికిందంటే.. చిన్న విషయం కాదు. హెచ్ఎండీఏ దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 300 గజాల చొప్పున 1,321 ప్లాట్లతో రెసిడెన్షియల్ లే అవుట్‌ను రూపొందించి వేలం వేస్తే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఐటీ కారిడార్‌కు కాస్త దగ్గరగా ఉండటంతో పాటు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండటం అంతకు మించి ఆహ్లాదకమైన వాతావరణం ఉండటంతో ఎక్కువ మంది మోకిలా వైపు నివాసానిక ిమొగ్గుచుపుతున్నారు. మోకిలా హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. R1 జోన్‌గా గుర్తించారు. R1 జోన్ సాధారణంగా నివాస అవసరాలకు అనువైన జోన్. చుట్టూ పచ్చదనం ఎక్కువగా ఉంటుంది.
ఐటీ కారిడార్ చుట్టూ ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ గా మారింది. అందుకే ప్రశాంతంగా జీవించాలనుకునేవారు మోకిలావైపు చూస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే మోకిలాలో రేట్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. కానీ ముందు ముందు డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బడా సంస్థలు లగ్జరీ విల్లాల నిర్మాణాలు చేపడుతున్నాయి. ఇప్పటికే లగ్జరీ నివాసాలకు అనువైన అడ్రస్ గా మోకిల నిలుస్తుందని మార్కెట్ వర్గాలు ఇప్పటికే అంచనాకు వచ్చాయి.