నాని… జాన్వీ.. ఏమిటీ క‌న్‌ఫ్యూజ‌న్‌?!

నాని – జాన్వీ క‌పూర్ జంట‌గా ఓ సినిమా రాబోతోందంటూ చిత్ర‌సీమ‌లో ఓ వార్త బాగా చ‌క్క‌ర్లు కొట్టింది. అయితే దీనిపై నాని స్పందించాడు. ”అది రూమ‌ర్ మాత్ర‌మే” అని కొట్టి పారేశాడు. అక్క‌డితో ఆగితే… అది నిజంగానే నిజం కాదేమో అని ఫిక్స‌యిపోయేవాళ్లంతా. కానీ ”మా చిత్ర‌బృందం ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతోందేమో నాకు తెలీదు. ‘స‌రిపోదా శ‌నివారం’ షూటింగ్ బిజీలో నేను ఆ ప్రాజెక్ట్ గురించి ప‌ట్టించుకోలేదు” అంటూ ముక్తాయింపు ఇవ్వ‌డం కొత్త క‌న్‌ఫ్యూజ‌న్‌కి దారి తీస్తోంది.

నానికి తెలియ‌కుండా సినిమాలో హీరోయిన్‌ని ఫిక్స‌వ్వ‌డం, ఆమెను సంప్ర‌దించ‌డం జ‌రిగే విష‌యాలు కావు. జాన్వీని సంప్ర‌దిస్తే అది నానికి తెలిసే జ‌రుగుతుంది. ఈ విష‌యంలో ఎలాంటి డౌటూ అవ‌స‌రం లేదు. నిజానికి జాన్వీ అయితే బాగుంటుంద‌ని టీమ్ మొత్తం ఫిక్స‌య్యింది. ఆమెతో మాట్లాడింది కూడా. అయితే.. ‘దేవ‌ర‌’ బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ నాని అండ్ టీమ్ వెయిట్ చేద్దామ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. జాన్వీ లుక్స్ బాగున్నాయి. కాక‌పోతే.. తెలుగు ఆడియ‌న్స్ జాన్వీని ఏ కోణంలో చూస్తారు? త‌ను ఇక్క‌డ క్లిక్ అవుతుందా, లేదా? అనే డౌటు చిత్ర‌బృందానికి ఉంది. ‘దేవ‌ర‌’ రిజ‌ల్ట్, అందులో జాన్వీ పెర్‌ఫార్మ్సెన్స్ ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకొని, త‌మ సినిమాలో ఆమెను తీసుకోవాలా, వ‌ద్దా? అనేది నిర్ణ‌యిస్తారు. అప్ప‌టి వ‌ర‌కూ నాని జాన్వీని హోల్డ్ లో పెట్టాడు. అందుకే… జాన్వీ త‌న సినిమాలో ఉందా, లేదా? అనే ప్ర‌శ్న‌కు క‌న్‌ఫ్యూజ‌న్ పుట్టించేలా స‌మాధానం చెబుతున్నాడ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. జాన్వీతో ఓ తెలుగు సినిమా చేద్దాం అనుకొన్న నిర్మాత‌లంతా ప్ర‌స్తుతం ‘దేవ‌ర‌` కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా హిట్ట‌యితే, జాన్వీ బిజీ అయిపోతుంది. లేదంటే లేదు. జాత‌కం మొత్తం దేవ‌ర‌ డిసైడ్ చేస్తుంది. అదీ మేట‌రు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కుక్కల విద్యాసాగర్ కూడా పరారీ !

కేసులు నమోదైన ప్రతి ఒక్కరూ పరారీ అవుతున్నారు. తాము తప్పు చేయలేదని విచారణ ఎదుర్కొంటామని ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. తాజాగా ముంబై నటి జెత్వానీపై కుట్ర చేసిన కేసులో...

తెలంగాణ తల్లి విగ్రహం – కేటీఆర్‌ ఆన్సర్ ఏది ?

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ ప్రకటంచి.. గొప్పగా బెదిరించానని అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తులో ఉంటే......

తగ్గుతున్న జగన్ భయం – ఏపీలో పెట్టుబడుల వెలుగులు !

ఐదేళ్ల అరాచక నీడ నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఎవరైనా రూపాయి పెట్టుబడితో రావాలంటే వణికిపోయే పరిస్థితి నుంచి మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెడితే బెటరన్న ఆలోచనలకు పెట్టుబడిదారులు వస్తున్నారు. గుజరాత్...

బెజవాడ ప్రజలకు తోడు, నీడగా ప్రభుత్వం !

బుడమేరు ఉగ్రరూపం కారణంగా నష్టపోయిన బెజవాడ వాసులందరికీ ఆర్థిక పరమైన మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ముంపు ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఆయన పరిహారం ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close