వైష్ణ‌వ్ తేజ్ సినిమా ఓకే అయ్యిందా?

‘ఉప్పెన‌’తో వైష్ణ‌వ్ తేజ్ ప‌రిచ‌యం అయ్యాడు. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఇండ‌స్ట్రీకి మ‌రో యూత్ హీరో దొరికాడ‌నుకొన్నాంతా. అయితే ఆ త‌రువాత చేసిన మూడు సినిమాలూ ఫ్లాపే. మ‌రో ప‌రాజ‌య భారం మోసే ఓపిక వైష్ణ‌వ్ తేజ్‌కు లేదు. అందుకే క‌థ‌ల విష‌యంలో ఆచి తూచి స్పందిస్తున్నాడు వైష్ణ‌వ్‌. ‘ఆది కేశ‌వ‌’ త‌ర‌వాత వైష్ణ‌వ్ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఏదీ బ‌య‌ట‌కు రాలేదు. చాలామంది ద‌ర్శ‌కులు క‌థ‌లు చెప్పినా పెద్ద‌గా స్పందించ‌లేదు. చివ‌రికి ఓ కథ ‘ఓకే’ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ర‌చ‌యిత కృష్ణ‌చైత‌న్య ఇటీవ‌ల వైష్ణ‌వ్ తో భేటీ అయ్యారు. వీరిద్ద‌రి మ‌ధ్యా కథా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు టాక్‌. కృష్ణ చైత‌న్య చెప్పిన క‌థ వైష్ణ‌వ్ కి బాగా న‌చ్చింద‌ట‌. దాంతో ఈ కాంబో సెట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. శ్రీ‌నివాస చిట్టూరి ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. ఇటీవ‌ల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు కృష్ణ చైత‌న్య‌. ఆ సినిమా ఫ్లాప్. అయితే వెంట‌నే… విశ్వ‌క్ సేన్ కృష్ణ చైత‌న్య‌కు మ‌రో ఆఫ‌ర్ ఇచ్చారు. చైత‌న్య కృష్ణ‌తో విశ్వ‌క్ మరో సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. ఈలోగా వైష్ణ‌వ్ తేజ్ ని కూడా సెట్ చేసి పెట్టుకొన్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు మొద‌ల‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కుక్కల విద్యాసాగర్ కూడా పరారీ !

కేసులు నమోదైన ప్రతి ఒక్కరూ పరారీ అవుతున్నారు. తాము తప్పు చేయలేదని విచారణ ఎదుర్కొంటామని ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. తాజాగా ముంబై నటి జెత్వానీపై కుట్ర చేసిన కేసులో...

తెలంగాణ తల్లి విగ్రహం – కేటీఆర్‌ ఆన్సర్ ఏది ?

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ ప్రకటంచి.. గొప్పగా బెదిరించానని అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తులో ఉంటే......

తగ్గుతున్న జగన్ భయం – ఏపీలో పెట్టుబడుల వెలుగులు !

ఐదేళ్ల అరాచక నీడ నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఎవరైనా రూపాయి పెట్టుబడితో రావాలంటే వణికిపోయే పరిస్థితి నుంచి మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెడితే బెటరన్న ఆలోచనలకు పెట్టుబడిదారులు వస్తున్నారు. గుజరాత్...

బెజవాడ ప్రజలకు తోడు, నీడగా ప్రభుత్వం !

బుడమేరు ఉగ్రరూపం కారణంగా నష్టపోయిన బెజవాడ వాసులందరికీ ఆర్థిక పరమైన మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ముంపు ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఆయన పరిహారం ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close