ఈ సీక్వెల్ ఎప్పుడు పూర్త‌య్యింద‌బ్బా..?!

మైత్రీ మూవీస్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులే గుర్తొస్తాయి. వాళ్లు తీసిన చిన్న సినిమాల్లో ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ ఒక‌టి. 2019 డిసెంబ‌రులో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్నే అందుకొంది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. స‌త్య చేసిన క్యారెక్ట‌ర్ హిలేరియ‌స్‌గా పండింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ అయిపోయింది. ‘మ‌త్తువ‌ద‌ల‌రా 2’ని సెప్టెంబ‌రు 13న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కీర‌వాణి త‌న‌యుడు శ్రీ‌సింహా ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. రితీష్ రానా ద‌ర్శ‌కుడు. ఈ సీక్వెల్ లో ఫ‌రియా అబ్దుల్లా క‌థానాయిక‌గా న‌టించింది. సునీల్, సునీల్, వెన్నెల కిషోర్‌, శ్రీ‌నివాస రెడ్డి కీల‌క పాత్ర‌లు పోషించారు.

సాధార‌ణంగా ఓ హిట్ సినిమాకు సీక్వెల్ వ‌స్తోందంటే ముందు నుంచీ హ‌డావుడి చేస్తారు. పైగా మైత్రీ మూవీస్ లాంటి సంస్థ అంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది. కానీ ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’ ప‌నుల‌న్నీ గ‌ప్ చుప్‌గా జ‌రిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌లైందో, ఎప్పుడు పూర్త‌య్యిందో కూడా తెలీకుండా గ‌మ్మ‌త్తుగా న‌డిపించేశారు. ఇప్పుడు స‌డ‌న్ గా రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించేశారు. సెప్టెంబ‌రు 13 అంటే రెండు వారాల స‌మ‌యం కూడా లేదు. ప్ర‌మోష‌న్ల‌కు ఇది స‌రిపోతుంద‌ని మైత్రీ మూవీస్ భావిస్తోంది. రేప‌టి నుంచి వ‌రుస‌గా అప్‌డేట్లు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు రానున్నాయి. ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ త‌ర‌వాత శ్రీ‌సింహా చాలా సినిమాలే చేసినా, ఏదీ వర్క‌వుట్ అవ్వ‌లేదు. ఈ సీక్వెల్ అయినా త‌న‌కు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కుక్కల విద్యాసాగర్ కూడా పరారీ !

కేసులు నమోదైన ప్రతి ఒక్కరూ పరారీ అవుతున్నారు. తాము తప్పు చేయలేదని విచారణ ఎదుర్కొంటామని ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. తాజాగా ముంబై నటి జెత్వానీపై కుట్ర చేసిన కేసులో...

తెలంగాణ తల్లి విగ్రహం – కేటీఆర్‌ ఆన్సర్ ఏది ?

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ ప్రకటంచి.. గొప్పగా బెదిరించానని అనుకుంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తులో ఉంటే......

తగ్గుతున్న జగన్ భయం – ఏపీలో పెట్టుబడుల వెలుగులు !

ఐదేళ్ల అరాచక నీడ నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఎవరైనా రూపాయి పెట్టుబడితో రావాలంటే వణికిపోయే పరిస్థితి నుంచి మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెడితే బెటరన్న ఆలోచనలకు పెట్టుబడిదారులు వస్తున్నారు. గుజరాత్...

బెజవాడ ప్రజలకు తోడు, నీడగా ప్రభుత్వం !

బుడమేరు ఉగ్రరూపం కారణంగా నష్టపోయిన బెజవాడ వాసులందరికీ ఆర్థిక పరమైన మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ముంపు ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఆయన పరిహారం ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close