మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసులో పోలీసులు చేసిన సోదాల్లో లిక్కర్ స్కాం గుట్టు బయటపడినట్లుగా తెలుస్తోంది. మదనపల్లి సోమవారం సీఐడీ ఉన్నతాధిరులతా వెళ్లారు. మొత్తం డేటాను దొరికిన పత్రాలను విశ్లేషిస్తే వందల కోట్ల నగదు లావాదేవీలు బయటపడ్డాయి. ఇదంతా మద్యం స్కాంలో లోగుట్టులోనిదేనని తేలడంతో సీఐడీ అధికారులు రంగలోకి దిగినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో మద్యం స్కాం మొత్తం.. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. డిస్టిలరీలను లాక్కోవడం దగ్గర నుంచి విచిత్రమైన బ్రాండ్లను ప్రవేశ పెట్టడం.. కమిషన్లు కొట్టేయడం వరకూ చాలా అవినీతి జరిగింది. మొత్తం నగదు లావాదేవీలు జరపడం వెనుక కూడా ఈ కుట్ర ఉంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ తర్వాత అధికారులు పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సహా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే లిక్కర్ కేసుకు సంబంధించిన సాక్,ష్యాలు దొరికినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే వాసుదేవరెడ్డి దగ్గర నుంచి తీసుకోవాల్సిన వాంగ్మూలాలు తీసుకున్నారు. అలాగే డిస్టిలరీలు పోగొట్టుకున్న పాత యజమానుల నుంచి వాంగ్మూలాలు రికార్డు చేశారు. పూర్తి స్థాయిలో స్కామ్ ను ఎక్స్ పోజ్ చయడానికి అవసరమైన సమాచారం అంతా సీఐడీ వద్దకు చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కాంపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఇప్పుడు మిథున్ రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో సమాచారం రావడంతో ఆయనకు నోటీసులు జారీ చేయడమో.. లేకపోతే అరెస్టు చేయడమో చేస్తారని భావిస్తున్నారు.