జైలు నుండి విడుదల అవుతూనే భావోద్వేగంతో ఎమ్మెల్సీ కవిత శపథం చేశారు. జైలు నుండి బయటకు రాగానే కొడుకును గుండెలకు హత్తుకొని కన్నీరు పెట్టుకున్న కవిత, భర్త అనిల్ తో పాటు సోదరుడు కేటీఆర్, హరీష్‌రావును కలుసుకున్నారు.
అక్కడున్న వారితో మాట్లాడుతూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. 18 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా… గెలుపోటములు ఎలా ఉన్నా, ఓ తల్లిగా పిల్లలకు ఐదున్నర నెలలుగా దూరంగా ఉండటం ఎంతో కష్టమైన పని. ఈ కష్టసమయంలో తన కుటుంబానికి అండగా ఉన్న వారికి పాదాభివందనం చేస్తున్నానన్నారు.
అయితే, దీన్ని వదలనని… వడ్డీతో సహ చెల్లించి తీరుతానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నేను మొండిదాన్ని, కేసీఆర్ బిడ్డను… తప్పు చేయలేదు అంటూ కవిత పునరుద్ఘాటించారు. తప్పు చేయకున్నా జైలుకు పంపారన్నారు.