త్వరలోనే భారత్ ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రధాని మోదీ పట్టుదలగా పని చేస్తున్నారు. కేంద్రానికి ప్రత్యేకమైన ప్రాంతం ఉండదు. అన్ని రాష్ట్రాలు కలిపితేనే కేంద్రం. ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలన్నీ కలిపితే ఐదు ట్రిలియన్స్ కావాలి. ఏపీ ఈ విషయంలో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని నిర్ణయించింది. భారత్ స్వాతంత్ర్య శత వార్షికోత్సవం నాటికి రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందు కోసం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నీతి ఆయోగ్ తో కలిసి … ఏఏ రంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకు రావాలన్నదానిపై విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు . ఏపీకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా … ఈస్ట్ కోస్ట్ ప్రాంతం ఉంది. లాజిస్టిక్స్ హబ్ గా మారడానికి అవసరమన అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేలా చూడాలని.. ఎక్కువ దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ప్రాథమికంగా సూచించినట్లుగా తెలుస్తోంది.
రెండు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అంటే చిన్న విషయం కాదు. ప్రస్తుతం భారత్ మొత్తం ఆర్థిక వ్యవస్థ నాలుగు ట్రిలియన్ డాలర్లకు అటూ ఇటూ ఉంది. అయితే వచ్చే రెండు దశాబ్దాల కాలంలో పూర్తిగా భారత్ ఆధిపత్య కొనసాగే చాన్స్ ఉంది. ఆ అవకాశాల్ని అందిపుచ్చుకునే లక్ష్యంతో.. చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. అంత కాలం ఏపీని లీడ్ చేయలేకపోవచ్చు. .. ఇప్పుడు వేస్తున్న రోడ్ మ్యాప్ .. వచ్చే లీడర్లకు దారి చూపిస్తుందని అనుకోవచ్చు.