రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్దత , చిత్తశుద్ది ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయో సీఎం చంద్రబాబు చేతల్లో చూపిస్తున్నారు. తన దృష్టిలో AP అంటే అమరావతి, పోలవరం అని ఇప్పటికే పలుమార్లు ఆయన స్పష్టం చేశారు. అందకు తగ్గట్టే ఆ పనులని స్పీడప్ చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర రాజధానిగా అమరావతికి 15వేల కోట్లు కేటాయించిన కేంద్రం ..పోలవరం విషయంలో పూర్తి బాధ్యత తీసుకోవాలన్న చంద్రబాబు విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించింది. తాజాగా జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించాలని పలు దఫాలుగా ప్రధాని , ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చలు ఫలించాయి.
పోలవరం ప్రాజెక్టు నిధులపై సీఎం ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణానికి కేంద్రం తీసుకుంది.
ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. పెండింగ్ సహా నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది.