కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేకుండా ఉండటం లేదు. తాజాగా బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్‌కు భారీ వరాలున్నాయి. వీటిని చూసి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీ తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంతోషం వ్యక్తం చేశారు.
ముందుగా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు కోసం పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. పెండింగ్ నిధులతో పాటు ఫేజ్ వన్ కోసం అదనంగా పన్నెండున్నర వేల కోట్లు నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేనా ఓర్వకల్లు, కొప్పర్తికి పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు ఆమోదం తెలిపారు. ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీలను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద నిర్మిస్తారు. మొత్తం 10 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు రూ. 28,602 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో ఎక్కువ ఏపీకి దక్కనున్నయా.ి
కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను రూ.2,137 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ హబ్‌తో 54,500 మందికి ఉపాధి లభిస్తుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లో రూ. 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ 2,786 కోట్లు వెచ్చిస్తారు. సుమారు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి రూ. పదిహేను వేల కోట్ల సాయం అందించనుంది. మిగతా రంగాల్లోనూ నిధులు కేటాయిస్తూ వస్తున్నారు. ఓ రకంగా ఇప్పుడు ఏపీకి కేంద్రం నుంచి ప్రోత్సాహం లభిస్తుందని అనుకోవచ్చు.