వైసీపీ పాలనలో పోలీసులు చేసిన అరాచకం గురించి బయటకు వస్తూంటే ఐపీఎస్ అధికారులు ఇలా చేస్తారా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ టీవీ5లో మూర్తి చర్చా కార్యక్రమంలో లైవ్ లోకి వచ్చారు. ఆమె ఏం జరిగిందో చెబుతూంటే..వినే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. బయటకు తెలిసింది తక్కువే .. అసలు ఆ కుటుంబ పడిన టార్చర్ మాత్రే చాలా ఎక్కువ అని తేల్చింది.
న్యూడ్ వీడియోలు పంపి టార్చర్ పెట్టిన కుక్కల విద్యాసాగర్
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ .. కాదంబరి జత్వానీని అత్యంత ఘోరంగా వేధించారు. ఎంతగా అంటే.. న్యూడ్ వీడియోలు కూడా పంపారు. ఆ వీడియో స్క్లీన్ షాట్లను జత్వానీ.. లైవ్ షోలో చూపించారు. పోలీసులు తప్పుడు కేసు పెట్టించి.. తము వేధించారని.. చనిపోవడం తప్ప.. అన్ని రకాల బాధలు అనుభవించామని హీరోయిన్ జత్వానీ కన్నీటి పర్యంతమయ్యారు.
18 కాదు 40 రోజుల పాటు నిర్బంధ హింస
కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో విమానాల్లో వెళ్లి మరీ జత్వానీ కుటుంబాన్ని పట్టుకొచ్చిన విజయవాడ పోలీసులు ఆ కుటుంబాన్ని నలభై రోజుల పాటు వేధించారు. ఓ గెస్ట్ హౌస్ లో పెట్టి చాలా రోజులు వేధించారు. తర్వాత కేసు పెట్టి జైల్లో ఉంచారు. తర్వాత అన్ని డాక్యుమెంట్లపై సంతకం పెట్టిన తర్వాత నలభైరోజుల తర్వాత బెయిల్ ఇచ్చారు. ఈ నలభై రోజుల కాలంలో పోలీసులు అత్యంత ఘోరమైన చర్యలకు పాల్పడ్డారు. వారి ఆస్తుల్ని.. బ్యాంకు అకౌంట్లను కూడా సీజ్ చేశారు. వారు తినడానికి కూడా డబ్బులు లేకుండా చేసి ఆకలితో అలమటించేలా చేశారు. వారి టార్చర్ కు మానసికంగా కుంగిపోయారు జత్వానీ తల్లిదండ్రులు.
భద్రతకు హామీ ఇస్తే కేసు పెట్టేందుకు జత్వానీ రెడీ
ఏపీ పోలీసులు తమపై పెట్టిన తప్పుడు కేసులు.. టార్చర్ దెబ్బకు జత్వానీ కుటంబం బయటకు రావడానికి కూడా భయపడుతోంది. ఎవరితోనూ చెప్పుకోలేక .. వారి కుటుంబం అంతా బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే గడుపుతోంది. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో రక్షణ ఉంటుందన్న దైర్యంతోనే తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. తన రక్షణకు భరోసా కల్పిస్తే.. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. జత్వానీ.. అధికారికంగా కేసు పెట్టిన తర్వాత ఈ వ్యవహారంలో అసలు నిజాల్ని పోలీసులు వెలికి తీసే అవకాశాలు ఉన్నాయి.