వెస్ట్ బెంగాల్ లోని కోల్ కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అకృత్యానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష వేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.
దేశాన్ని తీవ్రంగా కలిచివేసిన ఈ ఘటనలో నిందితుడికి మద్దతుగా వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎవరూ అతని తరఫున వాదించవద్దని డిమాండ్ లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే నిందితుడి తరఫున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాది ముందుకు వచ్చారు.
అనూహ్యంగా ఓ మహిళా న్యాయవాది నిందితుడి తరఫున నేను వాదనలు వినిపిస్తా అంటూ ముందుకు రావడం చర్చనీయాంశం అవుతోంది. అవును.. సంజయ్ రాయ్ తరఫున కోర్టు కేసులో వాదనలు వినిపించేందుకు కవితా సర్కార్ కదిలింది. దాంతో ఆమె ఎవరూ అంటూ నెటిజనం ఆరా తీస్తోంది.
కవితా సర్కార్…లీగల్ ఎయిడ్ డిఫెన్స్ లో మెంబర్ . కేసు విచారణ కోసం డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉన్న వారి కోసం వాదించేందుకు ఏ లాయర్ ముందుకురాని పరిస్థితుల్లో ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ లో ఉన్నవారు న్యాయ సహాయం అందిస్తుంటారు.
దాంతో సంజయ్ కోసం వాదించేందుకు కవితా సర్కార్ ముందుకు వచ్చింది. క్రిమినల్ కేసులో నిందితుడి తరఫున వాదించమని కోర్టు అడిగింది..అందుకు నేను అంగీకరించాను అంటూ చెప్పుకొచ్చింది.