చినబాబు చిరుతిండి పేరుతో లోకేష్‌పై పేపర్ ఉందని బురద చల్లేశారు కానీ.. అది ఇప్పుడు సాక్షి పైనే పడింది. విశాఖ కోర్టులో ఆయన రూ. 75 కోట్లకు వేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో విచారణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆ పత్రిక కథనంలో ఒక్కటంటే ఒక్క నిజం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్షి పత్రికలో రాసినట్లుగా ఖర్చులు చేసినప్పుడు తాను విశాఖలో కూడా లేనని ఆధారాలు సమర్పించారు.
నిజానికి గత వైసీపీ హయాంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు లెక్కలేనన్ని చేశారు. అవి జాతీయ మీడియాకు కూడా లీకులిచ్చారు. ఇలా చాలా పత్రికలు రాయడంతో.. అన్నింటికీ నారా లోకేష్ లీగల్ నోటీసులు పంపించారు. అన్ని పత్రికలు నారా లోకేష్‌కు క్షమాపణలు ప్రచురించాయి. వార్తలలో తప్పుడు సమాచారం ఇచ్చామని ఒప్పుకున్నాయి. కానీ సాక్షికి మాత్రం ఈగో అడ్డం చ్చింది. స్వయంగా జగనే సాక్షిలో తప్పుడు వార్తలు రాస్తారని చెప్పుకున్నారు. అయినా .. లోకేష్ కు క్షమాపణలు ఏమిటని ఊరుకున్నారు.
లోకేష్ పట్టువదలకుండా .. కోర్టు వరకూ వెళ్లారు. ఇప్పుడు కాకపోతే.. మరోఆరు నెలల్లో అయినా కోర్టు.. లోకేష్ కు క్షమాపణలు చెప్పమనో.. పరిహారం చెల్లింమనో ఆధేశాలు ఇస్తుంది. ఎందుకంటే ఆ కథనాన్ని సమర్థించుకునేందుకు సాక్షి వద్ద ఆధారాలే లేవు. అప్పుడైనా క్షమాపణ చెప్పాలి లేదా పరిహారం కట్టాల్సిందే. సాక్షి ఏ మార్గం ఎంచుకుంటుందో మరి !