వైసీపీలో సెప్టెంబర్ సంక్షోభం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడగా..తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మరికొంతమంది రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు సమయం కోసం వేచి చూస్తున్నారు.
పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్న వారిని బుజ్జగిస్తుండటంతో, అందుకు నేతలు మెత్తబడినట్లు తలాడిస్తోన్నా వైసీపీ నేతలకు ఓ పట్టానా నమ్మకం కుదరడం లేదు. జగన్ సెప్టెంబర్ 3 నుంచి 25వరకు రాష్ట్రంలో ఉండటం లేదు. ఆయన విదేశీ పర్యటన సమయంలోనే పార్టీ మారేందుకు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న టాక్ బలంగా నడుస్తోంది.
అయితే, పార్టీలో సంక్షోభం జగన్ అంచనా వేశారని అందుకే వలసలపై ఆయన ఏమి పట్టన్నట్లు ఉన్నారని వైసీపీ వర్గాలు ఆఫ్ ది రికార్డ్ చర్చికుంటున్నాయి. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను పిలిచి బుజ్జగించాల్సిన అధినేత మిన్నకుండిపోవడంపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ వైఖరి ఏమాత్రం ఆశాజనకంగా లేదని అందుకే నేతలు ఎవరి దారి వారు చూసుకోవాలన్న ఆలోచనతోనే కూటమి పార్టీలోకి జంప్ కావాలనే ఆలోచనకు వచ్చేశారనే అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ లండన్ ఫ్లైట్ ఎక్కగానే వైసీపీలో సెప్టెంబర్ సంక్షోభం చుట్టుముడుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది.