మమతా బెనర్జీ బెంగాల్ సీఎం. కోల్ కతాలో మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ పై హత్యాచార ఘటన జరిగింది. దీంతో బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. అయితే దీదీ వ్యూహాత్మకంగగా ఆ కేసును సీబీఐకి వెళ్లేలా చేసింది. అంతే ఇప్పుడు ఆమె విశ్వరూపం చూపిస్తున్నారు. నిందితుడికి ఉన్న పళంగా ఉరిశిక్ష వేయాలని ధర్నాలు ప్రారంభించారు . తప్పు అంతా కేంద్రానిదే అన్నట్లుగా రోజూ ఆమె ప్రకటనలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె అంటున్నారు. తాను ఈ అంశంపై లేఖ రాసినా స్పందించడం లేదంటున్నారు. కోల్ కతా ఆస్పత్రి అత్యాచర ఘటన నిందితుడి విషయంలోనూ సీబీఐ నిర్లయాలు కఠినంగా లేవని ఆమె అంటున్నారు. కేసు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు బీజేపీ నేతలు ఇలాంటి రాజకీయమే చేశారు. ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీబీఐ చేతికి వెళ్లే సరికి దీదీ అదే రాజకీయం చేస్తున్నారు. నిందితుడికి ఉరి శిక్ష వేయాలని ధర్నాలు చేస్తున్నారు.
ప్రతి రాష్ట్రంలో నేరాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఆపడం అసాధ్యం. సమాజం అంటే అదే. అయితే ప్రతీ దాన్ని రాజకీయం చేసుకోవడం మాత్రం మన దగ్గర ప్రత్యేకత. ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన ఘోరంలో నిజం ఏమిటో తెలియదు కానీ ఆ నేరం చుట్టూ జరిగిన, జరుగుతున్న ప్రచారంతో చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. బీజేపీ దాన్ని ప్రారంభిస్తే.. దీదీ కొనసాగిస్తున్నరు. ఎవరూ తక్కువేం కాదు.