కాస్త తీరిక చేసుకుని వెదకాలి కానీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ఇళ్లు చాలా చోట్ల ఉన్నాయి. గ్రేటర్ లో కలిసిపోయిన గండి మైసమ్మ ప్రాంతం కూడా ఇందులో ఒకటి. మియాపూర్, బాచుపల్లి చుట్టుపక్కల ప్రాంతా ల్లో ఇప్పటికే నిర్మాణం రంగం అభివృద్ధి చెందింది. అక్కడ ధరలు విపరీతంగా పెరిగాయి. వాటితో పోలిస్తే గండి మైసమ్మలో ఇళ్లు అందుబాటు ధరల్లో ఉంటున్నాయి. .
గండి మైసమ్మ ఆలయం పేరుతోనే గ్రామం ఏర్పడింది. త్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉంటుది. దుండిగల్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. చుట్టుపక్కల ఏరియాలు అభివృద్ధి చెందడంతో అక్కడ సామాన్యుల బడ్జెట్‌ను మించిపోయాయి ఇళ్ల ధరలు. అందుకే ఎక్కువ మంది చూపు గండి మైసమ్మ వైపు పడింది. ఇప్పుడు చిన్న చిన్న మేస్త్రీలు ఇళ్లు కట్టి అమ్ముతున్నారు. చిన్న బిల్డర్లు అపార్టుమెంట్లను కడుతున్నారు. ఇప్పుడిప్పుడే బడా నిర్మాణ సంస్థలు తమ నిర్మాణాలను ఇక్కడ చేపట్టేందుకు ముందుకొ స్తున్నాయి.
గండిమైసమ్మ చుట్టూ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, వైద్యశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత టెక్ మహేంద్ర విశ్వవిద్యాలయం, మల్లారెడ్డి విశ్వవిద్యాలయంతో పాటు వైద్య కళాశాల, మల్లారెడ్డి ఆసుపత్రి, నారాయణ హృదయాలయ, అరుంధతి ఆసుపత్రులు అతి సమీపంలోనే ఉన్నాయి.. గండి మైసమ్మలో పెట్టుబడి పెడితే భవిష్యత్‌కు భరోసాగా నిలుస్తుందనడంలో సందేహం లేదంటున్నారు రియల్ నిపుణులు.
గండి మైసమ్మ చౌరస్తా నుండి దుండిగల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్5కు పది నిమిషాల్లో చేరుకోవచ్చు. బాచుపల్లి క్రాస్‌రోడ్డుకు, ప్రగతినగర్‌కు పది నిమిషాల్లో .. కూకట్పల్లి జేఎన్టీయూకు 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఐటీ కారిడార్ చేరుకునేందుకు నలభై నిమిషాలు పడుతుంది. గండిమైసమ్మ చుట్టుపక్కల బాసర్గడి, గౌడవెల్లి , అయోధ్య క్రాస్‌రోడ్స్, బహదూర్‌పల్లి, మైసమ్మగూడ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు రూ.5,400 లకు అటుఇటుగా చెబుతున్నారు. అంటే మధ్యతరగతికి అందుబాటులో ఉన్నట్లే అనుకోవచ్చు.