మాజీ ముఖ్యమంత్రి… ప్రతిపక్ష నాయకుడి హోదా లేకున్న ఏపీ అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీకి నాయకుడు… జనం బాధల పట్ల ప్రభుత్వానికన్నా ముందు స్పందించాల్సిన బాధ్యత ఉన్నా అవేవీ జగన్ కు పట్టవని మరోసారి నిరూపితం అయ్యింది.
భారీ వర్షాలు, వరదలతో విజయవాడ గజగజ వణికిపోయింది. సీఎం సహ అధికారులంతా తెల్లవారుజామున వరకు వరద సహయక చర్యల్లోనే ఉన్నారు. ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటూనే, నడుము లోతు నీరున్నా… ప్రజల వద్దకే వెళ్లి, ధైర్యం చెప్పారు. నేనున్నా అనే భరోసా కల్పించారు.
కానీ, జగన్ మాత్రం సైలెంట్. గప్ చుప్ అయిపోయారు. అధికారం లేకపోతే ప్రజలేం అయిపోతే ఏంటీ అనుకున్నారో… ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి స్పందించినా ఏం లాభం అనుకున్నారో… ఎలాంటి రెస్పాన్స్ లేదు. సహయక చర్యల్లో పాల్గొన్న దాఖలాలు అసలే లేవు. ఈలాంటి సందర్భాల్లో ప్రభుత్వంకు అండగా ఉండటమో, ప్రభుత్వాన్ని కదిలించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రజల దగ్గరకు వెళ్తుంటాయి. సహయక చర్యల్లో పాల్గొంటాయి. కానీ విజయవాడ వరదల్లో ఆ సీన్ కనపడలేదు.
పైగా, జగన్ తన లండన్ టూర్ కు రెడీ కావటమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వైసీపీ క్యాడర్ సైతం ఇలా అయితే పార్టీ బతికి బట్టకట్టేదెలా అంటూ నిరాశకు లోనవుతున్నారు.
వరదల్లో నష్టాన్ని తగ్గించగలిగిన ప్రభుత్వం… సహయక చర్యలను ముమ్మరం చేసింది. పునరావస కేంద్రాల్లో ప్రజలకు కావాల్సిన వసతులను కల్పించింది. వరద తగ్గాక తిరిగి ప్రజలను తమ సొంతింటికి తరలించటం, వారికి సహయంపై ఫోకస్ చేసింది. అప్పుడు కూడా వైసీపీ సహయక చర్యల్లో పాల్గొంటుందన్న నమ్మకం ఎవ్వరికీ లేదు.