ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తిని గుడివాడ పోలీసులు అరెస్టు చేసి తీసుకొచ్చారు. అంతే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చాలా మంది ఏముంది నోటీసు ఇచ్చి వదిలేస్తారని అనుకున్నారు. కానీ కొంత మంది మాత్రం.. సోషల్ మీడియా పోస్టులతో అయితే నోటీసులు ఇచ్చి వదిలేస్తారేమో కానీ.. ఇంటూరిని గంజాయి, మహిళల అక్రమ రవాణా కేసుల్లో అరెస్టు చేశారన్న ప్రచారం చేసుకున్నారు. కానీ అది కూడా అవాస్తవమే. సోషల్ మీడియా కేసుల్లోనే అరెస్టు చేశారు. నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.
దీంతో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఫ్రస్ట్రేషన్ గా మారుతోంది. తమపై చిన్న చిన్నఅంశాలకే కేసులు పెట్టారని… కొట్టారని వీళ్లను ఎందుకు కొట్టరని వారి ప్రశ్న. అందులో సహేతుకత ఉంది. వారు చేసిన దానికి రెట్టింపు చేయాలన్నది వీరి డిమాండ్. ఎన్నికలకు ముందు అవే చాలెంజ్ లు చేశారు కూడా. వీరి డిమాండ్ ను పోలీసులు ఎందుకు తీర్చడం లేదున్నది సస్పెన్స్ గా మారింది. వారిపై అరెస్టులే కాదు.. ట్రీట్ మెంట్లు కూడా ఉండాలన్నది వారి కోరిక.
కానీ చాలా కీలకమైన వ్యక్తులకు ఇప్పటికే ఓ సారి అరెస్టులు చేసి నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారు. తర్వాత వారు నోరు మెదపలేకపోతున్నారు. ఎందుకో తెలియదు కానీ.. పుడింగిగా ఫీలయ్యే యనమల నాగార్జున అనే వ్యక్తి కూడా నోరు మెదపడం లేదు. బహుశా.. పోలీసులు అరెస్టు చేసినప్పుడు వారి ఫోన్లు స్వాధీనం చేసుకుని ఉంటారని అందులో ఉన్న రహస్యాలు బయటకు వస్తాయన్నభయంతోనే బితుకుబితుకు మంటున్నారేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
అయితే చట్టబద్దమైన పాలనతోనే అందర్నీ శిక్షిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పటికైతే.. అందరికీ రీపీటెడ్ గా తప్పులు చేసే అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగా కల్పిస్తోంది. తర్వాత గట్టిగా కొట్టడానికి ప్రణాళికలేమో కానీ.. ఇప్పటికైతే ఇన్స్టంట్గా వేధించేయాలని టీడీపీ సోషల్ మీడియా కోరుకుంటోంది.