టైర్ 2 నగరాల్లో అతి పెద్ద క్యాంపస్‌ను HCL విజయవాడ సమీపంలోని గన్నవరంలో పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గన్నవరం వద్ ఓ పెద్ద క్యాంపస్ ఉంది. కరోనా కారణంగా అక్కడ ఉద్యోగులు పరిమింగా చేరారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి సీటింగ్ కేపాసిటీతో ఆ సంస్థ పని చేస్తోంది. అక్కడే రెడో దశ విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల హెచ్‌సీఎల్ అత్యున్నత స్థాయి బృందం మంత్రి నారా లోకేష్ ను కలిసింది. ఈ సందర్భంగా మరో పదిహేను వేల ఉద్యోగాలు కల్పించే దిశగా పెట్టుబడులు పెడతామన్నారు. ప్రభుత్వం వైపు నుంచి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేష్ తెలిపారు. గన్నవరంలో ఇప్పుడు ఉన్న క్యాంపస్ ను విస్తరించాలా లేకపోతే మరో సిటీలో పెట్టాలా అన్నదానిపై కంపెనీ ఉన్నత వర్గాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఇప్పుడు ఉన్న క్యాంపస్ ను విస్తరిస్తేనే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగాతెలుస్తోంది.
గన్నవరంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గతంలోనే ప్రభుత్వం భూమి కేటాయిచింది. ఆ భూమిలోనే రెండో దశ విస్తరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు ప్రభుత్వం క్యాంపస్ ను వేరే చోట పెట్టాలని ప్రతిపాదిస్తే కంపెనీ ఆలోచిస్తుందేమో కానీ ఇప్పటికైతే.. గన్నవరంలో విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మత్తంగా మరో పదిహేను వేల ఐటీ ఉద్యోగాలు మరో ఏడాదిలో ఏపీ యువతకు లభించే అవకాశాలు ఉన్నాయి.