ప్రజలు బాధల్లో ఉన్నారు.. వారు ఏమైనా కోపంలో ఓ మాట అన్నా ఫీలవకండి… మన బాధ్యతల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కనిపించకూడదు అని అధికారులకు చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు చెప్పింది అర్థం చేసుకుంటే… ప్రజలకు తమ కోపం ఎవరిపై చూపించాలంటే..దానికి ఎదురుగా కనిపించేది ప్రభుత్వమే. అందుకే ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వాన్ని నిందిస్తారు. తిడతారు. కానీ వారికి అందే సేవలు.. రక్షణ కార్యక్రమాల విషయంలో మాత్రం లోటు రానీయకూడదు. చంద్రబాబు చెబుతున్నారు.
బుడమేరు కారణంగా విజయవాడకు వచ్చిన వరదల వల్ల కనీసం మూడు లక్షల మంది ముంపునకు గురయ్యారు. శివారు ప్రాంతాల్లోని ఎన్నో ఇళ్లు నీట మునిగాయి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఆహారం.. వారికి అవసరమన మందులు ఇవ్వడం అంత సులువు కాదు. ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా పట్టించుకునే తీరిక ఉండదు. వీలైనంతగా సాయం చేసేందుకు కొన్ని వేల మంది రంగంలోకి దిగి పని చేస్తున్నారు. బోట్లు, డ్రోన్లు వాడుతున్నారు. అయినా బాధితుల్లో ఏదో పోగొట్టుకున్నామన్న అసంతృప్తి ఉండనే ఉంటుంది.
ఈ ఎమోషనల్ ను అర్థం చేసుకోవాలని.. బాధితుల ఆగ్రహాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవాలని సూచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలు ఆగ్రహంతో ఉంటారు. తమ ఎదురుగా వచ్చే రాజకీయ నేతల మీద ప్రజలు ఫైరవుతూ ఉంటారు. ఈ కారణంతో చాలా మంది సహాయ కార్యక్రమాల వరకూ వెళ్లరు. కానీ చంద్రబాబు అలా కాదు. వాళ్ల ఎమోషన్ ను అర్థం చేసుకుని వారు కోపంలో ఒకటి, రెండు మాటలు అన్నా సరే దగ్గరుండి వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించి తదుపరి చర్యలపై దృష్టి పెట్టాలనుకున్నారు
ఇలాంటి సమయంలో ప్రజల ఎమోషన్ ను ఆసరాగా చేసుకుని రాజకీయం చేసుకోవడానికి చాలా మంది బయలుదేరుతారు. రాజకీయ పార్టీల కార్యకర్తల దగ్గర నుంచి ఎన్నికల సమయంలో జగన్ గెలుస్తాడని డబ్బాలు కొట్టి డబ్బులు పట్టుకుపోయిన వాళ్లు బోనస్ గా సాయం చేసేందుకు వస్తారు. అయితే ఎవరైనా అందులో నిజంగా ప్రభుత్వాన్ని … చంద్రబాబును తిట్టేసిన వాళ్లు ఉంటే వరదలు తగ్గాక… ఆవేశం చల్లబడ్డాక పరిస్థితి అర్థం చేసుకుంటారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకుంటారు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే సానభూతితో ఉండాలని అందరికీ సూచిస్తున్నారు.