జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని తనకు.. తన బినామీలకు ఎలా దోచిపెట్టారో కథలు కథలుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గాలి జనార్ధన్ రెడ్డి కి మరోసారి బళ్లారి దగ్గర ఏపీ సరిహద్దులో ఉన్న గనులను తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు. తమకు అభ్యంతరం లేదని.. గాలి జనార్ధన్ రెడ్డికే ఇచ్చేయవచ్చని నేరుగా సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ మైనింగ్ వయ్వహారం సుప్రీంకోర్టులో ఉండటంతో అనుమతి రావాల్సి ఉంది. జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ తేడాగా ఉండటంతో సుప్రీంకోర్టు అమికస్ క్యూరీని నియమించింది.
విచారణలో కోర్టుకు సహకరించేందుకు అమికస్ క్యూరీని నియమిస్తారు. ఈ అమికస్ క్యూరీ ఆ విషయాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని కోర్టుకు నివేదిస్తారు. ఇలా గాలి జనార్ధన్ రెడ్డికి మళ్లీ మైనింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వ అఫిడవిట్ పై అమికస్ క్యూరీ నివేదిక సమర్పించారు. ఇది పూర్తిగా.. అనుమానాస్పదంగా ఉందని.. వారి మధ్య అనుమానాస్పదమైన అనైతిక ఒప్పందం జరిగి ఉన్న సూచనలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్త చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ అఫిడవిట్ ను సమీక్షిస్తామని ప్రస్తుత ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
జగన్ ప్రభుత్వ బరి తెగింపునకు.. ఈ అఫిడవిట్టే పెద్ద సాక్ష్యంగా నిలుస్తోంది. మైనింగ్ విషయంలో ఇప్పటికే తోడు దొంగలుగా ప్రచారంలో ఉన్న జగన్, గాలి వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. జగన్ సీఎంగా ఉండి.. ప్రజా ఆస్తుల్ని ఎలా అడ్డగోలుగా దోచి పెట్టేందుకు ప్రయత్నించారో… సుప్రీంకోర్టును సైతం ఎలా మోసగించే ప్రయత్నం చేశారో ఈ అఫిడవిట్ ద్వారా తెలుస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తరపున ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. పరారీలో ఉన్న వెంకట్ రెడ్డినే.