హైదరాబాద్ అంటే చిరుద్యోగి నుంచి ఉన్నత స్థాయి వ్యాపారవేత్త వరకూ అందరూ హాయిగా జీవించగలిగే ప్రాంతం. అంటే పాతిక వేల జీతగాడైనా… పాతిక లక్షల ఆదాయపరుడైనా హాయిగా జీవించగలగడు. ఇటీవలి కాలంలో సామాన్యులు జీవించలేని పరిస్థితి వస్తుందని ప్రచారం జరుగుతోంది కానీ.. హైదరాబాద్ అందరికీ నివాసయోగ్యమే.
మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటిని సమకూర్చునే అవకాశాలు కూడా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటాయి. కోకాపేట వైపే అందరూ ఎక్కువగా చూస్తారు కానీ.. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. సరసమైన ధరలకు సొంత ఇంటిని కలం చేసే ప్రాంతాల్లో ఒకటి నారపల్లి. వరంగల్ హైవే వైపు ఉన్న ఈ గ్రామంలో ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. స్థానిక మేస్త్రీలు ఇళ్ల నిర్మాణాలు చకచకా పూర్తి చేస్తున్నారు. వారు అలా పునాది తీసి ఫర్ సేల్ బోర్డు పెట్టడం ఆలస్యం .. సేల్ అయిపోతున్నాయి. ఎందుకంటే.. ధరలు రీజనబుల్ గా ఉంటాయి మరి.
నారపల్లి కి ఇంకా పూర్తి స్థాయిలో పబ్లిసిటీ రాలేదు. దీనికి కారణం ట్రాఫిక్ సమస్య అనుకోవచ్చు. ఉప్పల్ నుంచి నేరుగా నారపల్లి వరకూ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయింది. ఆ ప్లైఓవర్ మరో ఏడాది..రెండేళ్లలో పూర్తయిపోయింది. అప్పుడు ఈ ఏరియా మరో బిజీ ఏరియా అయిపోతుంది. ఉప్పల్లో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడిప్పుడే నారపల్లి వైపు బడా హౌసింగ్ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. జైన్ హౌసింగ్ ఇప్పటికే భారీ ప్రాజెక్టును ప్రకటించింది . ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలు దృష్టి పెడితే ఆ ఏరియా కూడా ఖరీదుగా మారుతుంది. తొందరపడితే సొంత ఇంటికి ఓనర్ అయిపోవచ్చు.