ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే స్టార్ హీరోలు పడి చచ్చేవారు. స్టార్ డమ్ రావాలన్నా, స్టార్ గా మరో పది మెట్లు ఎక్కాలన్నా పూరితో ఓ సినిమా చేయాల్సిందే అనుకొనేవారు. అయితే వరుస ఫ్లాపులతో పూరి.. ఆ పేరు మొత్తం పోగొట్టుకొన్నాడు. కథలు పట్టుకొని తిరుగుతున్నా.. ఏ హీరో కనికరించడం లేదు. కొన్ని కాంబినేషన్లు సెట్టయినట్టే అయ్యి.. చివరి క్షణంలో చేజారిపోతున్నాయి. ఆటోజానీతో మొదలైన బ్యాడ్ టైమ్ పూరికి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఒకే సిట్టింగులో ఇద్దరు నందమూరి హీరోలకు కథలు సెట్ చేశా.. అని గొప్పగా చెప్పుకొన్న పూరి.. ఆ తరవాత ఆ సినిమా ఊసే ఎత్తలేదు. ఎన్టీఆర్‌తో టెంపర్ 2 కథ సిద్ధమైందని చెప్పిన పూరి… ఆ తరవాత ఆ సంగతి మర్చిపోయాడు. ఎన్టీఆర్ కూడా పూరితో మరో సినిమా చేయాలన్న ప్లాన్స్‌ని పూర్తిగా పక్కన పెట్టాడట. నిజానికి జనతా గ్యారేజీ తరవాత పూరితో సినిమా చేయాలని ఎన్టీఆర్ ఫిక్సయిన మాట వాస్తవమే. కానీ… ఇప్పుడు ఆ సినిమాని వద్దనుకొంటున్నాడట. ఆ స్థానంలో వక్కంతం వంశీ ప్రాజెక్టుని ఓకే చేశాడు. దాంతో పూరి చేతిలో ఉన్న ఆ ఒక్క సినిమా… పోయినట్టే. కల్యాణ్ రామ్ సినిమా ఉన్నా… దాంతో తనకు ప్రత్యేకమైన మైలేజీ ఏమీ రాదని భావిస్తున్నాడు పూరి. అందుకే.. బాలీవుడ్ పాట పాడుతున్నాడు. సంజయ్ దత్ కోసం ఓ కథ రెడీ చేశానని, త్వరలోనే ఈ సినిమా ఉంటుందని చెప్పుకొంటున్నాడు. ఆరకంగానైనా తనకు మైలేజీ వస్తుందేమో అన్నది పూరి లాజిక్కు. పూరిని తెలుగులో ఎవ్వరూ నమ్మకడం లేదన్నది రూఢీ అయిపోయింది. పూరి గత వైభవం తిరిగి దక్కించుకోవాలంటే ఓ బంపర్ హిట్ కొట్టాల్సిందే. మరి ఆ ఛాన్స్ ఇచ్చేదెవరు??