మా పార్టీ కార్యకర్తల్లో ఎక్కువ మందికి చదువు రాదు… అందుకే హైకమాండ్ ఏం చెప్పినా ప్రశ్నలు లేకుండా పాటించేస్తారు అని వైసీపీ అధికార ప్రతినిధి ఓ సారి టీవీ ఇంటర్యూల్లో చెప్పారు. వైసీపీ ఓటు బ్యాంక్ గా నేరస్తులు, నిరక్ష్యరాస్యులు, తాగుబోతులు ఉంటారు అయితే వీరికి తోడు కొంత మంది చదువుకున్నవారు కూడా ఉంటారు. వారు కూడా.. వైసీపీ అధినేత లేదా ఆ పార్టీ ఏది చెబితే దాన్నే ఫాలో అయిపోతారు. నమ్మే వాళ్లను పిచ్చి వాళ్లను చేయడం కరెక్ట్ కాదని ఎవరికీ డౌట్ రాదు. అదే ఆ పార్టీ బలం, బలహీనత అనుకోవచ్చు.
కళ్ల ముందు కనిపించేదాన్ని కూడా అబద్దమని వాదించడం వారి స్టైల్
కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని కూడా అది నిజం కాదు.. మేము చెప్పిందే నిజం అని వాదించడం వైసీపీ అధినేత స్టైల్. అమరావతిలో మునగకపోయినా బంగ్లాదేశ్ ఫోటోలు తీసుకొచ్చి మునిగిపోయిందని చెబుతారు. మునిగితే మునిగిందని చెప్పడం వేరు. చెన్నై మునిగింది.. ముంబై ప్రతి ఏడాది మునుగుతుంది.. హైదరాబాద్ కూడా అంతే. అయితే మునగకపోయినా మునిగిందని చెప్పాల్సిన అవసరం ఏముంది ?. కానీ చెబుతారు. ఒక్క అమరావతి కాదు.. చంద్రబాబు ఇల్లు. విజయవాడ వరదలు.. మరణాలు.. ఇలా లెక్కలేనన్నీ . ఇంకా చెప్పాలంటే.. ఫేక్లు తప్ప నిజం చెప్పరు. నిజం ఇదే గురూ అని ఎవరైనా చెబితే.. వారిపై ఎదురుదాడికి దిగుతారు. బుడమేరు నీరు చంద్రబాబు ఇంట్లోకి ఎలా వస్తుందని మీడియా అడిగితే… ఎందుకు రాదని ఎదురు ప్రశ్నించడం దానికి పీక్ స్టేజ్.
జగన్ ఏం చెప్పినా అదే గుడ్డిగా ప్రచారం చేయడం !
జగన్ అతి తెలివి తేటలు చాలా సార్లు బయట పడ్డాయి. అయితే ఆయనది వ్యూహాత్మక ప్రచారమే. అబద్దమైనా తనను నమ్మే వారికి అది నచ్చాలని… చంద్రబాబుపై వ్యతిరేకతతో తాను చెప్పేది నమ్ముతారని జగన్ నమ్మకం. ఈ ప్రచారంతో ఓ సారి విజయం వచ్చింది. 2014-19 సమయంలో జగన్ చేసిన అనేక తప్పుడు ప్రచారాలను జనం నమ్మారు. అందుకే ఇప్పుడు అదే చెబుతున్నారు. కానీ అన్నీ అబద్దాలేనని ఐదేళ్ల పాలనతో తేలిపోయింది. అయినా జగన్ మాత్రం.. తన తప్పుడు ప్రచార తెలివి తేటల్ని మాత్రం ఆపడంలేదు. దానికి సమర్థనగా… మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టి రాసుకునేందుకు మీడియా కూడా ఉంది.
వారే బలం .. వారే బలహీనత
వైసీపీకి ఆ గుడ్డి ఫ్యాన్సే బలం. అయితే వారే బలహీనత కూడా. వారు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా… తమ లోకంలో ఉంటూ.. ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ.. ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు .. సామాన్యులు అంత కంటే ఎక్కువగా తెలివి మీరుతున్నారు. కానీ వైసీపీ గుడ్డి ఫ్యాన్స్ మాత్రం ఎక్కడివారక్కడే ఉంటున్నారు. వైసీపీ దిగజారిపోతోంది. ఇలా దిగజారిపోతేనే ఏపీకి మంచిది. ఉండవల్లి వంటి వాళ్లు కూడా ఈ పరిస్థితి చూసి మరో ఇరవై ఏళ్లు వైసీపీ అధికారంలోకి రాదని తేల్చేస్తున్నారు.