వరద రాజకీయం ద్వారా కూటమి సర్కార్ ను బద్నాం చేయాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు ఫలించడం లేదు. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆలస్యంగా రంగంలోకి దిగి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ…ప్రభుత్వం అందిస్తోన్న సహాయక చర్యలపై రాజకీయం చేస్తూ ప్రజల నుంచి ఊహించని విధంగా ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది.
వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళే వైసీపీ నేతలు ఒకే ఎజెండాతో వస్తున్నారని ఆగ్రహించిన బాధితులు వైసీపీ నేతలను అక్కడికక్కడే నిలదీస్తున్నారు. ప్రభుత్వాధినేత రేయింబవళ్ళు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, మొత్తం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపి పరుగులు పెట్టిస్తుంటే..ప్రభుత్వంపై బురద జల్లుతారా ? అంటూ వైసీపీ నేతలకు ప్రజలు షాక్ లు ఇస్తున్నారు.
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ కు రెండుసార్లు ఇదే అనుభవం ఎదురైంది..ప్రభుత్వంపై ఏడుపు ఆపి, ఆదుకోవాలంటూ మహిళలు జగన్ ను నిలదీశారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు ఇదే తరహా అనుభవం ఎదురైంది. వరద బాధితుల పరామర్శకు వెళ్లి దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై ఒక్కసారిగా తిరగబడ్డారు.
ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం అందుతుందని చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. బాధితుల నుంచి ఆ తరహా సమాధానం ఊహించని ఆయన.. వారితో దురుసుగా ప్రవర్తించారు.. దాంతో అక్కడున్న వారంతా ఐదు రోజులు ఆలస్యంగా వచ్చింది రాజకీయం చేయడానికా? గో బ్యాక్ మొండితోక అంటూ నినాదాలు చేయడంతో మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు.