యాభై లక్షలు ఉంటే డబుల్ బెడ్ రూం కొనుక్కుని సెటిలైపోవాలని మధ్యతరగతి అనుకుంటారు. ఇంకాస్త ఆదాయ స్థితిమంతులు కోటిపైన అయిన ఖర్చుపెట్టి హైరైజ్ అపార్టుమెంట్లో కొనుక్కోవాలనుకుంటారు. ఇంకా కాస్త స్థితి మంతులు గేటెట్ కమ్యూనిటీ విల్లాల గురించి ఆలోచిస్తారు. ఈ విల్లాల సంస్కృతి బాగా పెరిగిపోయింది. కానీ.. ఐదారు కోట్లు పెడితేనే అత్యంత లగ్జరీ అనుకుంటారు. కానీ.. హైదరాబాద్ లో రూ. పాతిక కోట్ల ఖరీదైన విల్లాలు కూడా ఉన్నాయి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మైహోమ్ అవతార్ ఎదురుగా క్రిన్స్ అనే విల్లాల ప్రాజెక్టు ఉంటుంది. ఎక్కడా పెద్దగా పబ్లిసిటీ లేదు. కానీ హాట్ కేకుల్లాగా అమ్ముడైపోయాయి. నాలుగేళ్ల క్రితమే ఈ విల్లా ప్రాజెక్టులో అన్నీ సేల్ అయిపోయాయి. నివాసం ఉండటం ప్రారంభించారు. మాజీ మంత్రి హరీష్ రావు, హీరోయిన్ తమన్నా లాంటి వాళ్లు ఇక్కడ నివాసం ఉంటారు. తమన్నా హైదరాబాద్ నివాసం ఈ విల్లాల్లోనే. ఇంకా పలువురు ప్రముఖులు ఇందులో నివాసం ఉంటారు.
ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు, అమ్మినప్పుడు కూడా రూ. ఇరవై కోట్లకు తక్కువలో అమ్మలేదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. రీసేల్ లో ఇప్పుడు ఇది పాతిక కోట్లు దాటిపోయింది. దానికితగ్గట్లుగానే లగ్జరీ సౌకర్యాలు ఈ విల్లాలో ఉంటాయి. అల్ట్రా లగ్జరీ విదేశీ వస్తువులే విల్లాల్లో కనిపిస్తూంటాయి. హై సెక్యూరిటీ ఉంటుంది. క్రికెట్ గ్రౌండ్ .. ఫుట్ బాల్ గ్రౌండ్ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని మరికొన్ని విల్లాల ప్రాజెక్టులు కోకాపేట వైపు రాబోతున్నాయి.