రాష్ట్రంలో ఓవైపు భారీ వర్షాలు… వరదలు… అయినా, ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉన్న మాజీ సీఎం జగన్ లండన్ టూర్ వెళ్లాలనుకున్నారు. లండన్ లో చదువుతున్న తన కుమార్తెను కలిసేందుకు అనుమతించాలంటూ జగన్ కోర్టును కోరారు.
అయితే, జగన్ ఇంతకు ముందు సీఎంగా వాడిన డిప్లామాటిక్ పాస్ పోర్టును ఇప్పటికే సరెండర్ చేసి… రెగ్యూలర్ పాస్ పోర్టు ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. జగన్ కు 5 సంవత్సరాలకు గాను రెగ్యూలర్ పాస్ పోర్టు ఇవ్వాలని పిటిషన్ కూడా వేశారు. అయితే కోర్టు మాత్రం ఒక సంవత్సరానికే ఇచ్చేందుకు మొగ్గుచూపింది. దీన్ని జగన్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, తదుపరి విచారణకు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
కోర్టు అనుమతి రాకపోవటం, పాస్ పోర్టు రెన్యూవల్ ఆలస్యం కాబోతుండటంతో మాజీ సీఎం జగన్ లండన్ టూర్ కు బ్రేక్ పడింది. వచ్చే సోమవారం కోర్టు అనుమతి ఇస్తే ఆయన ప్రయాణం ఉంటుంది.
కొన్ని రోజులుగా విజయవాడ మొత్తం వరద నీటిలో ఉండటం, ప్రజలంతా ఇబ్బందుల్లో నేపథ్యంలో… జగన్ తన లండన్ టూర్ ను వాయిదా వేసుకుంటారా? ప్రజలను వరదలో వదిలేసి టూర్ కు వెళ్తారా…? అంటూ చర్చ జరిగింది.