డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు. అయితే ఇదంతా గతం.. టెక్నాలజీ పుణ్యమని బోలెడు టూల్స్, సిజీ ఎఫెక్ట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. విస్తృతంగా పెరుగుతున్న ‘ఏఐ’ సాయంతో విజువల్ ఎఫెక్ట్స్ టెక్నిక్స్ ని వాడి ‘డి- ఏజింగ్’ ని సులువుగా తెరపై చూపించగలుగుతున్నారు ఫిల్మ్ మేకర్స్.

నిజానికి డీ- ఏజింగ్ విజువల్ ఎఫెక్ట్ ఎప్పటినుంచో వుంది. 2006లో ‘X-మెన్: ది లాస్ట్ స్టాండ్’ సినిమాలో తొలిసారి డి-ఏజింగ్ టెక్నాలజీని వాడారు. తర్వాత చాలా సినిమాల్లో అవసరమైన చోట ఈ టెక్నాలజీని సీక్రెట్ గా వాడేవారు. కొన్ని సినిమాల్లో ఈ విజువల్ ఎఫెక్ట్ ని మేకప్ అని భ్రమపడిన సందర్భాలు వున్నాయి. ఆస్కార్ అవార్డ్స్ కోసం పది కేటగిరిల్లో నామినేట్ అయిన ‘ది ఐరిష్ మ్యాన్’ సినిమాలో లీడ్ క్యారెక్టర్ ని యంగ్ లుక్ లో చూపించడానికి డి-ఏజింగ్ వాడారు. ఈ సినిమాకి ఒక్క అవార్డ్ రాకపోవడానికి కారణం డి-ఏజింగ్ లో హ్యూమన్ టచ్ మిస్ అయ్యిందని ఆస్కార్ జ్యూరీ అభిప్రాయపడిందనే కథనాలు వున్నాయి. అదే వేరే సంగతి.

ఇండియన్ సినిమాలో షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’ సినిమా కోసం తొలిసారి ఈ టెక్నాలజీని వాడారు. అందులో షారుక్ యంగ్ లుక్ కాస్త వింత వుండటం గమనించవచ్చు. అలాగే ‘జీరో సినిమా కోసం కూడా ఈ టెక్నాలజీని ఆశ్రయించాడు షారుక్. ఆయనకి కి విఎఫ్ ఎక్స్ స్టూడియో వుంది. ఆ స్టూడియో ద్వారా ఈ టెక్నాలజీని ఒక ప్రయోగంలా చేయడానికి ఈ రెండు సినిమాలు చేశాడని కొందరు చెప్తారు. నిజానికి ఆ రెండు సినిమాల్లో చెప్పుకోదగ్గ జీవకళ వుంది. తెలుగులో వచ్చేసరికి చిరంజీవి ఆచార్య కోసం డి-ఏజింగ్ ని వాడారు. కల్కిలో యంగ్ అమితాబ్ బచ్చన్ ని చూపించడానికి కూడా ఈ టెక్నాలజీ ని ఉపయోగించారు.

లేటెస్ట్ గా వచ్చిన విజయ్ గోట్ లో అయితే ఏకంగా ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ని డి-ఏజింగ్ చేశారు. సెకండ్ హాఫ్ అంతా ఆ క్యారెక్టర్ పైనే నడిపారు. ఆ లుక్ పై ఇప్పటికే బోలెడు విమర్శలు వచ్చాయి. దీంతో డి-ఏజింగ్ పై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది.

నిజానికి డి-ఏజింగ్ టెక్నాలజీ మంచి ఫలితాలని ఇస్తుంది. ఒక క్యారెక్టర్ బాల్యం చూపించాలంటే సరిగ్గా అదే పోలికతో వుండే ఆర్టిస్ట్ ని పట్టుకోవడానికి చాలా కసరత్తు చేయాలి. వృద్దుడిగా చూపించాలంటే మేకప్ కి గంటల తరగబడి వెచ్చించాలి. ఆ మేకప్ సరిగ్గా కుదురుతుందో లేదో కూడా చెప్పలేం. ఈ సవాళ్ళ నుంచి బయటపడే అవకాశం డి-ఏజింగ్ ఇస్తుంది. గతించిన నటులని మళ్ళీ తెరపై చూసుకునే అవకాశం ఇందులో వుంది. గోట్ లో విజయ్ కాంత్ ని అలాగే తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇదొక మ్యాజికల్ టెక్నాలజీ . సమయం, బడ్జెట్. శ్రమ అన్నీ అన్నీ కలిసొస్తాయి.

అయితే నాణెనాకి రెండో వైపు అన్నట్టుగా డి-ఏజింగ్ తో నష్టాలు కూడా వున్నాయి. ఇదొకరకంగా డీప్ ఫేక్ టెక్నాలజీ. అసలు ఆర్టిస్ట్ అవసరం లేకుండా తన ఫోటో గ్రాఫ్ తో పని పూర్తయిపోతుంది. ప్రపంచంలో ఎవరినైనా రిక్రియేట్ చేసుకోవచ్చు. ప్రముఖ సంస్థలైతే వారి అవసరాలు తగ్గట్టు వ్యక్తులని సంప్రదించి కంటెంట్ కి అనుగుణంగా డి-ఏజింగ్ ని వాడుతాయి. ఇలా కాకుండా డి-ఏజింగ్ ని పెడదారిని వాడితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురౌతాయి.

డి-ఏజింగ్ ని ఒక దశ వరకే వాడాలి. శ్రుతి మించిచే తెరపై అంతా కుత్రిమంగా తయారౌతుంతుంది. గోట్ సినిమానే అందుకు ఉదాహరణ. డి-ఏజింగ్ తో విజయ్ కాంత్ ని చూడటం బావుంది. అది ఒక సీన్ కి పరిమితం అయ్యింది కాబట్టి ఆడియన్ ఎంజాయ్ చేశాడు, అదే సినిమా అంతా అయితే ఫిల్మ్ మేకర్స్ దొరికిపోతారు. డి-ఏజింగ్ లో తయారుచేసిన రూపానికి కొన్ని హ్యూమన్ ఎక్స్ ప్రెషన్స్ పలకవు. డబ్బింగ్ లో లిప్ సింక్ దగ్గర దొరికిపోతారు. కొంచెం పరిశీలనగా గమనిస్తే అదొక బొమ్మలాట గా వుంటుంది. గోట్ సెకండ్ హాఫ్ లో కుర్ర విజయ్ పరిస్థితి కూడా అలానే తయారైయింది. ఓల్డ్ విజయ్ ఉన్నంత నేచురల్ గా కుర్ర విజయ్ కనిపించలేదు. డైలాగ్ దగ్గర లిప్ సింగ్ చాలా ఇబ్బంది పెట్టింది. ఒకటి రెండు సీన్లు వరకూ ఓకే కానీ సినిమా అంత డి-ఏజింగ్ తో చూట్టేయాలని చూస్తే మాత్రం ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోతారని గోట్ రుజువుచేసింది.

డి-ఏజింగ్ గేమ్ ఛేంజరే. కాకపోతే దీని వాడకం పరిమితంగా వుంటే మంచి ఫలితం చూడొచ్చు. అలాగే డి-ఏజింగ్ విషయంలో కొన్ని ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావాలి. ఒక నటుడిని రిక్రియేట్ చేసినప్పుడు, అతని స్టార్ డమ్ వాడుకుంటున్నపుడు తగిన రాయలిటీ చెల్లిస్తున్నారా లేదా? ఈ విషయంలో హక్కుదారులు ఎవరిని సంప్రదించాలనే అంశంపై కూడా విధివిధానాలు రూపొందించాలి. అప్పుడే డి-ఏజింగ్ సరైన మార్గంలో ఫలితాలని ఇస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close