వైసీపీ ఫ్యాన్స్ అంటే అందరికీ అలుసైపోతున్నారు. ప్రతి ఒక్కరూ టీజ్ చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా బ్రహ్మాజీ కూడా చేరారు. జగన్ రెడ్డి .. వరదల సహాయ చర్యలపై సుదీర్ఘమైన చాట భారతాన్ని తన ట్విట్టర్లో పోస్టు చేశారు. దానికి కౌంటర్ గా బ్రహ్మాజీ స్పందించారు. నిజమే సార్.. ప్రభుత్వం ఫెయిలయింది.. మనం రంగంలోకి దిగుదాం. వెయ్యి కోట్లు ఇచ్చేసి.. క్యాడర్ మొత్తాన్ని దింపేసి .. విజయవాడ ప్రజల్ని ఆదుకుందాం.. అని పిలుపునిచ్చారు. జగన్ అన్నా అని పిలిచినా అది చాలా సర్కాస్టిక్ గా ఉందని ఎవరికైనా అర్థమైపోతుంది.
లేట్ నైట్ బ్రహ్మాజీ ట్వీట్ పెట్టినా అది వైరల్ అయిపోయింది. ఇది వైసీపీ ఫ్యాన్స్ కు సహజంగానే మంట పుట్టించింది. వారు బ్రహ్మాజీపై తిట్లందుకున్నారు. ఉదయం వరకూ జరిగేదంతా జరిగిన తర్వాత బ్రహ్మాజీ ట్వీట్ డిలీట్ చేశారు. అతడు సినిమాలో .. మహేష్ బాబు కొట్టడానికి వస్తే తూచ్ అని చెప్పినట్లుగా.. .. ట్వీట్ చేశారు. తన అకౌంట్ హ్యాక్ అయిందని ఆ ట్వీట్ తాను పెట్టలేదని చెప్పుకొచ్చారు.
అప్పటికే స్రీన్ షాట్లు తీసుకుని చేయాల్సిన రచ్చను యాంటీ జగన్ ఫ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తీరికగా ఇలాంటి ట్వీట్ పెట్టడం వైసీపీ కార్యకర్తల్ని మరింత వెక్కిరించినట్లయింది. బ్రహ్మాజీ గతంలో జగన్ కు మద్దతుగా పోస్టులు పెట్టేవారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారినట్లుగానే కనిపిస్తున్నారు. కానీ ధైర్యం చేయలేకపోతున్నారు.