దివ్వెల మాధురీ పది రోజులు సైలెంట్ గా ఉంటానంటే.. అందరూ ఏంటో అనుకున్నారు. ఈ పది రోజుల్లో ఆమె సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకుంది. టెక్కలిలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించేసుకుంది. దువ్వాడ కూడా అదే పని చేశారు. రిజిస్టిస్ట్రేషన్ అంతా ఆయిపోయాక.. పత్రాలు చేతికి వచ్చాక అది తన ఇల్లు కాబట్టి దివ్వెల మాధురీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు.
తాను ఎన్నికలతో పాటు ఇతర ఖర్చుల కోసం దివ్వెల మాధురీ దగ్గర రెండు కోట్లు తీసుకున్నానని.. అలాగే మరో వ్యక్తి దగ్గర అరవై లక్షలు తీసుకున్నానని వాటంతటికి ఆ ఇల్లు ఆమెకు రాసిచ్చేశనని దువ్వాడ శ్రీను ప్రకటించారు. ఇప్పుడు ఇది తన ఇల్లు అని.. కావాలంటే.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి దువ్వాడ శ్రీనుకు అద్దెకు ఇస్తానని దివ్వెల మాధురీ చెబుతున్నారు. అంటే ప్లాన్డ్ ప్రకారమే దువ్వాడ ఆస్తుల్ని .. రాయించుకున్నారన్నమాట.
దువ్వాడ భార్యపిల్లలు దివ్వెల మాధురీ ట్రాప్ లో తన తండ్రి పడి ఆస్తులన్నీ రాసిచ్చేస్తున్నారని.. ఆందోళన చేస్తున్నారు ఆస్తులు, స్టోన్ క్రషర్ తమ పేరుపై రాసి.. ఆయన ఎటైనా పోవచ్చని ఆఫర్ ఇచ్చారు. కానీ ఆస్తులు రాసిచ్చేందుకే దువ్వాడ శ్రీనివాస్ మొగ్గు చూపారు. భార్య పిల్లల ఏడుపులను ఆయన పట్టించుకోలేదు.