టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న దేవినేని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, తలశిల రఘురాంలు అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
దీంతో దేవినేని అవినాష్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న అవినాష్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.మంగళవారం రోజు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అక్కడైనా దేవినేని అవినాష్ కు ఊరట దక్కుతుందో లేదో చూడాలి.