చిన్న సినిమా టాక్ బావుంటే గానీ థియేటర్స్ కి జనం రారు. కంటెంట్ నమ్ముకొని చాలా ప్లాన్ గా చేసుకొని తమ మార్కెట్ ని కాపాడుకోవడం ద్రుష్టిపెడుతుంటారు హీరోలు. అయితే కొన్నిసార్లు పరిస్థితులు ఎవరీ చేతిలో వుండవు. హీరో ఎప్పుడో ఒప్పుకుకొని పూర్తి చేసిన సినిమాలు ఒకేసారి రిలీజ్ వస్తాయి. మొన్న రాజ్ తరుణ్ పురుషోత్తముడు, తిరగబడరా సామి వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. రెండూ ఫ్లాపులే. అది వేరే సంగతి. ఇప్పుడు సుహాస్ కి ఇలాంటి పరిస్థితి వచ్చింది.
సుహాస్ జనక అయితే గనక సినిమా సెప్టెంబర్ 12 వస్తోంది. ఆ తర్వాత వారమే అంటే సెప్టెంబర్ 20న సుహాస్ నటించిన గొర్రెపురాణం అనే మరో సినిమా థియేటర్ కి క్యూ కడుతోంది. జనక అయితే గనక సినిమాపై పాజిటివ్ బజ్ వుంది. కాన్సెప్ట్ క్యాచిగా వుంది. పైగా దిల్ రాజు లాంటి నిర్మాత ప్రాజెక్ట్ వెనుక వున్నారు. అలాగే ఓవర్సిస్ రైట్స్ ని సుహాస్ తీసుకోవడంతో సినిమాలో ఎదో మేటర్ వుందనే పాజిటివ్ హైప్ వచ్చింది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా చేశారు.
కానీ గొర్రెపురాణంకు ఇంకా ఎలాంటి హడావిడి లేదు. సుహాస్ లాంటి హీరో నుంచి రెండు వారాల్లో రెండు సినిమాలని థియేటర్స్ లో ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది అనుమానం. మంచి కాన్సెప్ట్స్ ప్లానింగ్ తో సినిమాలు చేస్తుంటాడు సుహాస్. జనక అయితే గనక గత వారమే రావాల్సింది. కానీ వరదలు కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు వారం గ్యాప్ లోనే వచ్చేస్తున్నాయి. మరి అడియన్స్ రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలి.