ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్ ఖాతాలో వేసుకున్నారు. ఓవర్సీస్లో దేవర ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రీసేల్ బుకింగ్‌తో మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంది దేవర. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో తారక్ ని ప్రీసేల్ రికార్డ్ గురించి అడిగారు యాంకర్. అసలు ట్రైలర్ రిలీజ్ కాకముందే వన్ మిలియన్ డాలర్ల మార్క్ చేరుకోవడం ఎలా అనిపించిందనే ప్రశ్నకు తారక్ సమాధానం ఇస్తూ.. ‘ఇదంతా గాడ్ బ్లెసింగ్, ఫ్యాన్స్, ఆడియన్స్ లవ్’ అని చెప్పారు.
ఈ సినిమాని హిందీ లో ధర్మ ప్రొడక్షన్ పై కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు.” దేవరని హిందీలో విడుదల చేయడం ఆనందంగా గర్వంగా వుందని చెప్పారు కరణ్ జోహార్. దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువస్తున్న సంగతి తెలిసిందే.