చంద్రబాబు ప్రభుత్వంలో సీఎస్‌గా చేసి పొడిగింపు ఇవ్వలేదన్న కోపంతో జగన్ రెడ్డి పంచన చేరిన పనికి మాలిన రాజకీయాలు చేసిన కల్లం అజేయరెడ్డి అలియాస్ అజేయకల్లం నిర్వాకాలు చాలా ఉన్నాయని బ యటకు వస్తున్నాయి. తాను చంద్రబాబుపై వేసిన బురదకు ప్రతిఫలంగా .. శ్రీశైలం ఆలయాన్నే ఆయన మింగేయాలనుకున్నట్లుగా వెల్లడైన సంచన విషయాలు.. కలకలం రేపుతున్నాయి. శ్రీశైలం దగ్గర ఎకరాన్ని ట్రస్ట్ పేరుతో తీసుకుని మెల్లగా దాన్ని శ్రీశైలం ఆలయాన్ని స్వాధీనంచేసుకునే దిశగా చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఇవి బయటకు రావడంతో అజేయకల్లాం పిట్టకథలు చెబుతూ.. మీడియాలో సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
శ్రీశైలం ఆలయానికి పోటీగా పక్కనే ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడట ఓ వ్యక్తి. అయితే ఖర్చు ఎక్కువైపోతుందని విరాళాలకు వెళ్లాడట. దాని కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న తనను అంటే కల్లంరెడ్డిని పిలిస్తే సరే అని అందులో చేరిపోయాడట. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఇక తిరుగులేకుండా పోయింది. ఏనుగుల చెరువును.. ఇతర భూమిని మెల్లగా ఆక్రమమించుకోవడం ప్రారంభించారు. చివరికి కోర్టులో పడటంతో ఆగిపోయింది. అయితే పిటిషన్లు వేసిన వారితోనూ.. ఈ ప్రైవేటు ఆలయ నిర్వాహకులు మాట్లాడారట. ఈ విషయాన్ని కల్లం రెడ్డినే చెబుతున్నారు.
గడ్డం పెంచుకుని ఆధ్యాత్మిక వాదిగా కనిపించేందుకు ఇటీవల ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు హయాంలో సీఎస్ గా చేసి.. అప్పట్లో ఆ ట్రస్టుకు అనుమతులు ఇప్పించుకుని తర్వాత జగన్ రెడ్డిహయాంలో సలహాదారుగా చేసి.. గుడిని.. గుడిలో లింగాన్ని కూడా మింగే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాక పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు. ఇలాంటి అధికారులు స్వార్థం చేసే తప్పుడు పనులే రాష్ట్రానికి పెను శాపమయ్యాయి.