డ్యాము కొట్టుకుపోయి ఊరంతా మునిగిపోయి సర్వం కోల్పోయిన వాళ్లను వరుసగా నిలబెట్టి.. మీరంతా మర్చిపోండి… నాకొదిలిపెట్టండి అని పది రోజుల తర్వాత వచ్చి భరోసా ఇచ్చే సీఎంను చూశాం.. వారు నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ టార్పాలిన్ టెంట్లలోనే ఉంటున్నారు. అదే సమయంలో వరదలు వస్తే పది రోజుల బురదలోనే ప్రజలతో పాటే ఉండి వారి కష్టాలను పంచుకున్న సీఎంను చూశాం. నాకొదిలి పెట్టండి అని చెప్పలేదు. చేసి చూపించారు.
ఇళ్లు కడిగించి.. బైకుల రిపేర్లూ చేయిస్తున్నారు !
చంద్రబాబు మధ్యతరగతి ప్రజలు ఎలా ఇబ్బంది పడతారో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆ కష్టాలను తీర్చడానికి యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. బురదతో నిండిపోయిన ఇళ్లను కడిగిస్తున్నారు. బైకుల రిపేర్లు చేయిస్తున్నరు. ఇన్సూరెన్స్ కంపెనీల్ని తీసుకొచ్చి క్లెయిమ్ లు చేయిస్తున్నారు. ఎలక్ట్రిషియన్స్, ప్లంబర్స్ ను కూడా రప్పించి రిపేర్లు చేయిస్తున్నాయి. ఇవన్నీ .. ప్రభుత్వం చేయిస్తుందని చాలా మంది అనుకోలేదు. కానీ ఇవే పెద్ద సమస్యలుగా ఫీలవుతారని.. చంద్రబాబు వాటిని కూడా చేయిస్తున్నారు.
సంక్షోభమే అవకాశం
పది రోజుల కిందట బుడమేరుకు వరద వచ్చిందని తెలిసిన వెంటనే ఆయన ఫీల్డులోకి వెళ్లిపోయారు. ఆయన బస్సు కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చింది. అప్పట్నుంచి పది రోజుల పాటు కలెక్టరేట్ లలోనే ఆయన ఉన్నారు. అదే సచివాలయం .. బస్సులోనే నిద్ర. విజయవాడ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతనే ఆయన ఇంటికి వెళ్లారు. ఈ పది రోజుల పాటు ఆయన వరద బాధితుల మధ్యనే ఉన్నారు.
ప్రజలకు అండగా ఉండటం అంటే ఇదీ !
ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ ఆపలేరు. కానీ ప్రాణాల్ని.. ఆస్తుల్ని కాపాడుకునేందుకు వీలైనంత ప్రయత్నం చేయాలి. అది ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. అది అయిపోయిన తర్వాత నష్టాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలి. ఈ మిషన్ లో చంద్రబాబు.. వంద శాతం ప్రజాభిమానాన్ని.. మిడిల్ క్లాస్ అభిమానాన్ని పొందుతున్నారని అనుకోవచ్చు.