ఇళయరాజా, రెహ్మాన్, హారిష్ జయరాజ్, యువన్ శంకర్ రాజా.. వీళ్ళ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో ఉవ్వెత్తున ఎగసిన మరో సంగీత కెరటం అనిరుధ్ రవిచందర్. వై దిస్ కొలవెరి డి పాట అనిరుధ్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతి ఆల్బమ్ కి ఒక వైరల్ సాంగ్ ఇవ్వడం అనిరుధ్ స్పెషాలిటీ. అదే అతన్ని టాప్ లీగ్ లో నిలబెట్టింది.
అయితే అనిరుధ్ తో ఒక సమస్య వుంది. తమిళ్ డైరెక్టర్స్ కి వర్క్ అవుట్ అయినట్లుగా తెలుగు డైరెక్టర్స్ అనిరుధ్ నుంచి అవుట్ పుట్ తీసుకోలేకపోతుంటారు. ఎన్నో అంచనాలు పెట్టుకొని అజ్ఞాతవాసి కోసం అనిరుధ్ ని రంగంలోకి దించారు త్రివిక్రమ్. నిజానికి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అజ్ఞాతవాసి ఒక డిఫరెంట్ ఆల్బం. కొన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. కానీ అవి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని మ్యాచ్ చేయలేకపొయాయి.
అన్నిటికి మించి అజ్ఞాతవాసి రీరికార్డింగ్ విషయంలో పెద్ద దెబ్బకొట్టాడు అనిరుధ్. ఆయనకి త్రివిక్రమ్ ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారో కానీ హైవోల్టేజ్ యాక్షన్ సీన్ లో కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఫ్యుజన్ చేసి బీజీఎంని తయారు చేశాడు. అది క్లాస్ ఆడియన్స్ కి ఎక్కినంతగా మిగతా సెక్షన్స్ ఆడియన్స్ కి కిక్ ఇవ్వలేదు.
తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా అనిరుధ్ తో ఒక సమస్య వుంది. ధనుష్, మురగదాస్, లోకేష్ కనకరాజ్, నెలన్స్ దిలీప్ కుమార్ సినిమాలకి కుదిరినంతగా మిగతా వారితో అనిరుద్ కి అంతగా సింక్ అవ్వదు. ఒక్కసారి పరిశీలనగా చూస్తే అనిరుధ్ వైరల్ హిట్స్ అన్నీ ఈ కాంబినేషన్ లోనే వుంటాయి. వీళ్ళ సినిమాకి పని చేసినప్పుడు ఒక డిఫరెంట్ అనిరుద్ కనిపిస్తాడు.
అలాగే అనిరుధ్ వర్కింగ్ స్టయిల్ కొంచెం వెరైటీ. చివరి వరకూ నానుస్తాడు. అప్పుడు కూడా డైరెక్టర్ ఇన్వాల్మెంట్ చాలా వుండాలి. ప్రతిది ఇన్పుట్ ఇచ్చి చెప్పి చేయించుకోవాలి. అలా కాకుండా అంతా తనకి వదిలేస్తే.. తనదగ్గరున్న ట్రాక్స్ బ్యాంక్ నుంచి ర్యాండమ్ ఏవో ట్రాక్స్ వాడి చూట్టెస్తాడనే టాక్ వుంది.
దీనికి తాజా ఉదాహరణ దేవర ట్రైలర్ బీజీఎంలో గమనించవచ్చు. ట్రైలర్ ఫస్ట్ హాఫ్ అంతా ఫియర్ సాంగ్ ట్రాక్ బీట్ ని యాజ్ ఇట్ టీజ్ గా పరిచేసి డైలాగ్ వచ్చిన సౌండ్ బ్యాలన్స్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్ అంతా రొటీన్ గా వినిపించే ఒక ఎపిక్ బీజీఎంని వాడాడు. వాస్తవం చెప్పాలంటే చప్పగా వుంది బీజీఎం. ఇంకా ఎదో హైని కోరుకునే ఆడియన్ కి ఆ బీజీఎం రెండిషన్ సరిపోలేదు.
ట్రైలర్ లో ఎక్కువ డైలాగులు వున్నాయి. అనిరుధ్ మాత్రం ఏం చేస్తాడు ? డైలాగ్ వినిపించాలి కదా.. అనొచ్చు. కానీ పాయింట్ ఇక్కడ డైలాగులు కాదు. ట్రైలర్ చివరి నలభై సెకన్లు ఒక పవర్ ఫుల్ ట్రాక్ కంపోజర్ చేసే స్కోప్ వుంది. కానీ అనిరుధ్ మాత్రం ఆ ఎపిక్ మోడ్ లోనే టైం లైన్ ని లాగేశాడు.
ట్రైలర్ వరకూ ఓకే కానీ సినిమాలో ఇలాంటిది కంటిన్యూ కాకూడదు. ప్రస్తుత ఆడియన్స్ బీజీఎం విషయంలో చాలా పర్టిక్యులర్ గా వున్నారు. విక్రమ్ సినిమాకి అనిరుధ్ బీజీఎం ప్రత్యేక ఆకర్షణ. తారక్ తో సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా దానికి నెక్స్ట్ లెవల్ ఊహిస్తారు. ఆ అంచనాలు అందుకోవాల్సిన భాద్యత కొరటాల, అనిరుధ్.. ఇద్దరిపైన వుంది. సెన్సార్ అయిపొయింది కాబట్టి రీరికార్డింగ్ ఫినిష్ అయ్యింటుంది. సమయం వుంది కాబట్టి బీజీఎం విషయంలో మరోసారి క్షుణ్ణంగా చూసుకొని బెటర్మెంట్ చేసుకోవడం మంచిది.