హైదరాబాద్ కర్నాటకలో సెప్టెంబర్ 17ను అధికారికంగా చేస్తారు. మహారాష్ట్రలో కలిపిన జిల్లాల్లోనూ అధికారిక ఉత్సవాలు చేస్తారు. కానీ, తెలంగాణలో మాత్రం సెప్టెంబర్ 17ను అధికారికంగా చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రావు.
విలీనం అని ఒక పార్టీ, విద్రోహమని మరొక పార్టీ, విమోచనం అని ఒక పార్టీ… సెప్టెంబర్ మొదటి వారం వచ్చిందంటే చాలు రోజూ విమర్శలు, ప్రతి విమర్శలే.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈసారి సైలెంట్ గా సెప్టెంబర్ 17న అధికారికంగా జరపనున్నారు. విలీనం, విమోచనం, విద్రోహం… ఏదీ పేర్కొన లేదు. కానీ ఆ రోజు ప్రజా పాలన దినోత్సవంగా పేర్కొంటూ ప్రతి జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఎగురవేయబోతున్నారు.
ఏ జిల్లాలో ఏ మంత్రి జెండా ఎగురవేస్తారు, మంత్రులు లేని చోట చైర్మన్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో జాతీయ జెండా ఎగురవేస్తారని పేర్కొనగా..హైదరాబాద్ లో జెండాను సీఎం ఎగరేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
.
Nomination of Dignitaries for Telangana Praja Palana Dinotsavam 2024